twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడు అరెస్టుకు కోర్టు ఆదేశం

    By Srikanya
    |

    Lokayukta orders arrest of serial director
    హైదరాబాద్ : జనావాస ప్రాంతాల్లో టీవీ సీరియల్ (ఇంద్రాణి) షూటింగ్ నిర్వహించి చిన్నారి మృతికి కారణమైన వ్యవహారంలో సీరియల్ డెరైక్టర్ యు.సీతారాంను అరెస్టు చేసి ఈ నెల 9న తమ ఎదుట హాజరుపరచాలని చందానగర్ ఎస్సైని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి బుధవారం ఆదేశించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వి.శరత్‌బాబు, వి.వెంకటేశ్వర్‌రావు, ఆర్.రాజు, బళ్లా అర్చనలను కూడా హాజరుపరచాలని ఎస్సైకి జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

    ఘటన తీవ్రతను తెలిపే విధంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో అన్ని వివరాలు పొందుపర్చక పోవడంపై లోకాయుక్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జనావాస ప్రాంతాల్లో షూటింగ్‌కు అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్‌కు అనుమతించిన ఆర్‌వీ.ఉదయన్ గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ అధ్యక్షున్ని కేసులో నిందితునిగా చేర్చాలని ఆదేశించారు. గత నెల 26న ఆర్‌వీ.ఉదయన్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో షూటింగ్‌లో భాగంగా కారు నడుపుతుండగా చిన్నారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ బాబు మృతి చెందగా, మరో బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

    అనుమతి లేకుండా షూటింగ్ జరుపుడంపై సీరియల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసారు. యాక్సెడెంట్ కు కారణమైన నటి అర్చనను, అనుమతి లేకుండా షూటింగ్ నిర్వహిస్తుండటంపై ప్రొడక్షన్ మేనేజర్ వెంకట్రావ్, డ్రైవర్ రాజును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసారు. కారు వెళ్లే సన్నివేశం చిత్రీకరిస్తుండగా, కారు అదుపు తప్పి పక్కనే పార్కులో ఆడుకుంటున్న చిన్నారులపైకి దూసుకెళ్లింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా...అప్పటికే సాత్విక్ రెడ్డి అనే బాలుడు మరణించాడు. మరొక చిన్నారి సాత్విక కు కాలు, చెయ్యి ఫ్యాక్టర్ అయింది.

    అనుకోకుండా కారు అదుపు తప్పిందని, వెంటనే కళ్లు తిరిగి పడిపోయానని, తన తప్పేమీ లేదని, తప్పులేకున్నా డబ్బు ఖర్చుపెట్టడానికి, వారికి పరిహారం ఇవ్వడానికి నేను సిద్ధమని నటి అర్చన వాదిస్తుండం గమనార్హం. అయితే డ్రైవింగ్ లో సరైన శిక్షణ లేకుండా పక్కన డ్రైవర్ ను కూర్చో పెట్టుకుని అర్చన డ్రైవింగ్ చేసినట్లు సమాచారం.

    English summary
    AP Lokayukta B Sudarshan Reddy on Tuesday directed the police to arrest the TV serial director U Seetharam whose serial shooting resulted in the tragic death of a child and injuries to another child on October 26 in the premises of a gated community complex at Chandanagar and produce him before the court on November 9.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X