»   »  'బాహుబలి' : తెలుగు శాటిరైట్ రైట్స్ ..ఎవరికి ఎంతకి?

'బాహుబలి' : తెలుగు శాటిరైట్ రైట్స్ ..ఎవరికి ఎంతకి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మన సినీ పరిశ్రమలో ఇంతకు ముందేన్నడూ లేని భారీ సాంకేతిక పరిజ్ఞానంతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం 'బాహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల బ్రద్దలు కొట్టే స్దాయిలో భాక్సాఫీస్ వద్ద ప్రబంజనంలా విజృంభించింది. అంతేకాదు ఇప్పుడు శాటిలైట్ అమ్మకం విషయంలోనూ మునెపెన్నడూ లేని విధంగా ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసిన షాక్ ఇచ్చింది.

‘బాహుబలి' చిత్రం తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం మాటీవి, జెమిని, జీ టీవీ వారు భారీ ఎత్తున పోటీ పడ్డారు. అయితే మా టీవి వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. వారు ఇందుకోసం వెచ్చించిన మొత్తం కూడా సామాన్యమైనది కాదు. రెండు పార్టులని 30 కోట్లు కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు. అయితే ప్రీమియర్ షో కే భారీగా టీఆర్పీలు వస్తాయని, అందుకు తగ్గ యాడ్స్ తో రికవరీ, లాభాలు ఉంటాయని మాటీవి భావిస్తున్నట్లు సమాచారం.


 MAA TV bags Baahubali Satellite Rights!

గత కొద్ది కాలంగా మాటీవీ ఏ పెద్ద సినిమా శాటిలైట్ రైట్స్ కొనటం లేదు. దాంతో మేనేజ్ మెంట్ ఆ డబ్బుని మొత్తం ప్రక్కన పెట్టి, బాహుబలిపై ఇన్వెస్ట్ చేసింది. మిగతా ఛానెల్స్ కు ఆ విధంగా మాటీవి ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు మాటీవి ఈ సినిమాని ఏ రేంజిలో ప్రమోట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెర్షన్స్ పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఇంటర్నేషనల్ మార్కెట్లో మినిమం వంద కోట్లు సంపాదించాలని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ప్రేక్షకులు చూడటం కోసం ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ ప్రేక్షకులను అందుకోవాలంటే... అంతర్జాతీయ నిపుణులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. అందులో బాగంగా...హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన Vincent Tabaillon అనే ఎడిటర్ ని ఎంపిక చేసారు.


ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్కా మీడియా వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.

English summary
MAA TV acquired the Satellite Rights of Baahubali - The Beginning and Baahubali - The Conclusion for a staggering Rs 30 crore.
Please Wait while comments are loading...