»   » డ్యామేజ్ కంట్రోల్: 'సర్దార్' నిర్మాతతో మాటీవి డిస్కౌంట్ కోసం బేరం

డ్యామేజ్ కంట్రోల్: 'సర్దార్' నిర్మాతతో మాటీవి డిస్కౌంట్ కోసం బేరం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఊహించని విధంగా భారీ నష్టాలు మిగిల్చే దిశగా భాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కు మాత్రమే కాక మాటీవి కు సైతం ఈ కలెక్షన్స్ నిద్రపట్టనీయకుండా చేస్తున్నాయి.

మధ్యలో మాటవీకి ఏమిట షాక్ అంటే... ఈచిత్రం శాటిలైట్ రైట్స్ ని మిగతా టీవి ఛానెల్స్ జెమినీ, జీ తెలుగులతో పోటీ పడి మరీ దక్కించుకుంది. ఈ రైట్స్ కోసం పన్నెండున్నర కోట్లు చెల్లించారు. బాహుబలి తర్వాత ఎక్కవ రేటు పెట్టింది ఈ చిత్రానికే. దాంతో ఇప్పుుడ మాటీవి యాజమాన్యం డ్యామేజ్ కంట్రోలుకు పూనుకున్నట్లు సమాచారం.


MAA TV in damage control mode after Sardar’s poor show

డ్యామేజ్ కంట్లోల్లో భాగంగా..మాటీవి యాజమాన్యం... సర్దార్ నిర్మాత శరద్ మరార్ ని కలిసారని చెప్తున్నారు. ఈ శాటి లైట్ రైట్స్ కోసం అడ్వాన్స్ చెల్లించి ఎగ్రిమెంట్ చేసుకున్న మాటీవి...సినిమా ఫలితం దారుణంగా ఉంది కాబట్టి...ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసి, రేటు తగ్గించమని అడుగుతున్నట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.


అయితే శరద్ మరార్ మాత్రం అలాంటిది అడగవద్దని, తాము తర్వాత పవన్ తో చేయబోయే చిత్రంలో దాన్ని ఎడ్జెస్ట్ చేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. మాటీవి వారు మాత్రం రేటు తగ్గించవల్సిందే అని పట్టుబడుతున్నట్లు వినపడుతోంది. ఇక గతంలో శరద్ మరార్..మాటివికు సీఈవో గా పనిచేసిన సంగతి తెలిసిందే.

English summary
MAA paid an advance to secure the Sardaar Gabbar Singh,rights and is now in discussion with Sarat Maraar to see if he can give any discounts on the satellite rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu