»   »  షాక్: మా టీవీ అమ్మకం...ఎంతకి ?

షాక్: మా టీవీ అమ్మకం...ఎంతకి ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
MAA TV
హైదరాబాద్: తెలుగులో పెద్ద నెట్ వర్క్ అయిన మాటీవీ అమ్మకానికి సిద్దమైందని సమాచారం. మా నెట్ వర్క్ లో ప్రధానమైన మాటీవితో పాటు మా గోల్డ్, మా మ్యాజిక్, మా సినిమా ఛానెల్ లు సైతం అమ్మనున్నారని తెలుస్తోంది. త్వరలో మా కామెడీ ఛానెల్ కూడా ప్రారంభం కానుంది. ఇక మాటీవిలో సోనీ టీవీ వారు వాటా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నా ఆ డీల్ కాలేదు. మూడేళ్ల క్రిందట 400 కోట్లు చెప్పిన ఈ రేటు 1800 కోట్లు కు పెరిగిందని తెలుస్తోంది. మాటీవీ దగ్గర 1200 సినిమాలు ఉన్నాయి.

వాస్తవానికి మాటీవీలో 30% వాటా తీసుకుంటున్నట్లు సోనీ పిక్చర్స్ టెలివిజన్ వారు నాలుగు రోజుల క్రితం ముంబై లో మొదలైన మూడు రోజుల ఫిక్కీ ప్రేమ్స్ సదస్సులో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ డీల్ ఇంకా పూర్తి కాలేదని మాటీవి చెప్తూ వస్తోంది. మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మిగిలిన ప్రధాన వాటాదారులతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ అమ్మకం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గ్రూఫ్ గా ఎదుగుతున్న మాటీవి మరో మూడు ఛానెల్స్ తో మన ముందుకు వస్తున్నట్లు సమాచారం. మా ఫ్యామిలీ, మా లైఫ్, మా కామెడీ ఛానెల్స్ అని వాటికి పేర్లు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మా నెట్ వర్క్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని చెప్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీస్ వద్దే మరో భవంతి తీసుకుని అక్కడ ఈ కొత్త ఛానెల్స్ పని ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు

. త్వరలో ఈ ఛానెల్స్ లో జాబ్ కోసం ప్రకటన వస్తుందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మా నెట్ వర్క్ లో ...మా టీవీ, మా మూవీస్, మా మ్యూజిక్, మా గోల్డ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇక మా టీవీని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు. దీని డైరక్టర్స్...నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ మరియు సి.రామకృష్ణ.

మాటీవీ ఛానెల్లో పాపులర్ పోగ్రామ్ లు...

మీ ఆరోగ్యం మీ చేతుల్లో

నవ విధ భక్తి

మనీ మనీ

చిన్నారి పెళ్ళికూతురు

మా ఊరి వంట

మోడర్న్ మహాలక్ష్మి

నాదీ ఆడజన్మే

పవిత్ర శ్రీ శనిదేవుని మహిమలు

వసంత కోకిల

అన్నా చెల్లెలు

ఎదురీత

English summary
MAA Management wishes to sell the channel which is at top position. Seems like, Board of Directors wants to cash in on the current No.1 Position.As of now, Market valuation of MAA TV is currently Rs 1800 crore. The Telugu channel already entered into an MoU with Sony for a takeover.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu