»   » మా TV 'నెట్ వర్క్ మరో మూడు చానల్స్

మా TV 'నెట్ వర్క్ మరో మూడు చానల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
MAA TV
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గ్రూఫ్ గా ఎదుగుతున్న మాటీవి మరో మూడు ఛానెల్స్ తో మన ముందుకు వస్తున్నట్లు సమాచారం. మా ఫ్యామిలీ, మా లైఫ్, మా కామెడీ ఛానెల్స్ అని వాటికి పేర్లు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మా నెట్ వర్క్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించిందని చెప్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట ఆఫీస్ వద్దే మరో భవంతి తీసుకుని అక్కడ ఈ కొత్త ఛానెల్స్ పని ప్రారంభించినట్లు చెప్పుకుంటున్నారు.

త్వరలో ఈ ఛానెల్స్ లో జాబ్ కోసం ప్రకటన వస్తుందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మా నెట్ వర్క్ లో ...మా టీవీ, మా మూవీస్, మా మ్యూజిక్, మా గోల్డ్ ఛానెల్స్ ఉన్నాయి. ఇక మా టీవీని పెనుమత్స మురళీ కృష్ణంరాజు స్థాపించారు. దీని డైరక్టర్స్...నిమ్మగడ్డ ప్రసాద్, అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్, రామ్ చరణ్ తేజ మరియు సి.రామకృష్ణ.

మాటీవీ ఛానెల్లో పాపులర్ పోగ్రామ్ లు...

మీ ఆరోగ్యం మీ చేతుల్లో
నవ విధ భక్తి
మనీ మనీ
చిన్నారి పెళ్ళికూతురు
మా ఊరి వంట
మోడర్న్ మహాలక్ష్మి
నాదీ ఆడజన్మే
పవిత్ర
శ్రీ శనిదేవుని మహిమలు
వసంత కోకిల
అన్నా చెల్లెలు
ఎదురీత

English summary
Buoyed by the success of its recent initiatives and an increase in veiwership, MAA TV is all set to roll out three more channels shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu