For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Inaya Sultanaపై హీరోయిన్ సంచలన పోస్ట్: అతడికి సుఖమే ముఖ్యం.. ఆ పనికి ఒప్పుకుంటేనే ఆఫర్ అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వచ్చినా.. వాటన్నింటినీ బీట్ చేసి నెంబర్ వన్ ప్లేస్‌లో వెలుగొందుతోంది బిగ్ బాస్. మన దగ్గరే కాదు.. దేశంలోనే ఇది అత్యధికంగా రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇప్పుడీ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక, గత వారంలోనే ఇనాయా సుల్తానా షో నుంచి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ మాధవి లత సంచలన పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

  ఈ సీజన్‌లో ఫోకస్ అయింది

  ఈ సీజన్‌లో ఫోకస్ అయింది

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇనాయా సుల్తానా మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన వీడియో వల్ల ఫేమస్ అవడమే. దీనికితోడు ఆరంభంలోనే గొడవలతో ఈ బ్యూటీ హైలైట్ అయింది. దీంతో మొదట్లోనే ఇనాయా పేరు మారుమ్రోగిపోయింది.

  Bigg Boss Winner: ఫినాలే వీక్‌లో షాకింగ్ ఓటింగ్.. అతడికే అన్ని ఓట్లా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే!

   గొడవలు.. లవ్ ట్రాక్‌తో క్రేజ్

  గొడవలు.. లవ్ ట్రాక్‌తో క్రేజ్


  బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇనాయా సుల్తానా ఎన్నో గొడవల్లో భాగం అయింది. ఇలా ఈ అమ్మడు చాలా మందికి టార్గెట్‌గా మారిపోయింది. ఆ సమయంలో ఈ భామకు సపోర్టు బాగా పెరిగిపోయింది. అయితే, ఆర్జే సూర్యతో లవ్ ట్రాక్ నడపడం వల్ల నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. దీనివల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. కానీ, తర్వాత పుంజుకుంది.

  ఊహించని విధంగా అవుట్

  ఊహించని విధంగా అవుట్


  బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రవర్తన ఎలా ఉన్నా ఆట కోసం వందకు వంద శాతం శ్రమించిన ఇనాయా సుల్తానా మంచి పేరును తెచ్చుకుంది. ఫలితంగా ఆమె చాలాసార్లు ఎలిమినేషన్స్‌ను తప్పించుకుంది. దీంతో ఈ బ్యూటీ టాప్ 5లో నిలవడంతో పాటు రన్నరప్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఫినాలేకు ముందే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయింది.

  మరోసారి హద్దు దాటిన కేతిక శర్మ: బెడ్‌పై ఆ బాడీ పార్టులు కనిపించేలా!

  ఇనాయాపై మాధవి పోస్ట్‌లు

  ఇనాయాపై మాధవి పోస్ట్‌లు


  ప్రస్తుత సీజన్‌లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అవడంతో బిగ్ బాస్ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెది ఫేక్ ఎలిమినేషన్ అంటూ ఎంతో మంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇనాయా ఎలిమినేషన్‌పై ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవి లత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్టులు చేసింది.

  వాళ్లంతా అందుకే వచ్చారు

  వాళ్లంతా అందుకే వచ్చారు


  ఇనాయా ఎలిమినేషన్‌పై మాధవి లత.. 'ఎప్పుడూ స్టాండ్ తీసుకోని ఆది రెడ్డి టాప్ 5లోకి, ఎప్పుడూ బ్యాగేజ్ క్యారీ చేసే కీర్తీ టాప్ 5లోకి, కొన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడిన శ్రీహాన్ టాప్ 5లోకి, బీబీ సపోర్ట్ ఉందని అనుకున్న శ్రీసత్య టాప్ 5లోకి, ముందుగానే విన్నర్ అని ఫిక్స్ అయిన రేవంత్ టాప్ 5లోకి, జెంటిల్‌మన్ రోహిత్ కూడా టాప్ 5లోకి. మరి ఇనాయా' అని పోస్ట్ చేసింది.

  నటి సురేఖ వాణి అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా వామ్మో!

  కమిట్‌మెంట్ ఇవ్వలేదనా

  కమిట్‌మెంట్ ఇవ్వలేదనా


  అదే పోస్టులో మాధవి లత 'ఇనాయాను ఎందుకు టాప్ 5లోకి తీసుకోలేదు? ముంబై టీమ్ వాళ్లకు కమిట్‌మెంట్ ఇవ్వలేదా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తద్వారా ప్రేక్షకుల్లో, ఇనాయా సుల్తానా అభిమానుల్లో ఎన్నో అనుమానాలను రేకెత్తేలా చేసింది. దీంతో ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే, చర్చనీయాంశంగా కూడా మారిపోయింది.

   అతడి సుఖమే ముఖ్యమని

  అతడి సుఖమే ముఖ్యమని


  మరో పోస్టులో మాధవి 'ముంబై వాళ్లు అవకాశం ఉన్న ప్రతిచోటా కమిట్‌మెంట్ అడుగుతున్నారు. ఇనాయా టాప్ 2లోకి వస్తే కమిట్‌మెంట్ ఇవ్వదని భయమేసిందా? మీకు ఆడియెన్స్ సంతోషం కంటే మీ బాస్ సుఖమే ముఖ్యం కదా. అందుకే తనను ఎలిమినేట్ చేసేశారా? ఈ సారి రివ్యూలు కూడా ఒక్కరూ స్ట్రాంగ్‌గా ఇవ్వలేదు. ఇది నా బలమైన స్టేట్‌మెంట్' అని చెప్పుకొచ్చింది.

  English summary
  Inaya Sultana Eliminated From Bigg Boss Telugu 6th Season Last Week. Now Actress Maadhavi Latha Put Allegations on Bigg Boss Team about This.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X