»   » అర్చన దారుణంగా ప్రవర్తించింది.. కసి తీర్చుకొన్నా.. కల్పనను టార్గెట్.. మధుప్రియ

అర్చన దారుణంగా ప్రవర్తించింది.. కసి తీర్చుకొన్నా.. కల్పనను టార్గెట్.. మధుప్రియ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిదా చిత్రంలో మధుప్రియ పాడిన వచ్చాడే అనే పాటకు విశేష స్పందన వస్తున్నది. అలాగే బిగ్‌బాస్‌లో మధుప్రియ ప్రవర్తన వివాదామైనప్పటికీ.. చివర్లో ఆమె వ్యవహరించిన తీరు అందర్ని ఆకట్టుకొన్నది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎన్టీఆర్‌తో 30 నిమిషాలు ముచ్చటించిన తీరు, ఆమె చూపించిన చొరవ బుల్లితెర వీక్షకుల్లో మంచి ఫీలింగ్ కల్పింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో ముచ్చటించింది. బిగ్ బాస్ హౌస్‌లోని విషయాలు ఆమె మాట్లల్లోనే..

బిగ్‌బాస్, ఫిదాతో సంతోషం

బిగ్‌బాస్, ఫిదాతో సంతోషం

ఫిదా సినిమాలో నేను పాడిన పాటకు మంచి రెస్సాన్ రావడం ఆనందంగా ఉంది. బిగ్‌బాస్‌లో పాల్గోనడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫిదా సినిమా చూశాను. సినిమా చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా హ్యాపీగా ఫీలయ్యాను. నేను పాటకు మంచి స్పందన రావడం మరీ ఆనందాన్ని ఇచ్చింది.

Bigg Boss Telugu : Bigg Boss given Warning to Contestants
అర్చనతో గొడవ బాధకలిగించింది

అర్చనతో గొడవ బాధకలిగించింది

అర్చనతో చిన్న విభేదాలు వచ్చాయి. హోమం దగ్గర మంటపెట్టే విషయంలో చిన్న గొడవ జరిగింది. హరితేజ వైపు పొగతో బాధపడుతుండటంతో అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు. అప్పటివరకు నేను, కార్తీక పడిన కష్టం గురించి ఎవరూ పట్టించుకోలేదు. దాని గురించి ఎవరూ అడుగలేదు. కానీ హరితేజకు పొగ రావడంతో అందరు ఆమెపై సానుభూతి చూపించారు. హరితేజ పొగ వస్తుంది.. నువ్వు హరితేజ ప్లేస్‌లో కూర్చో అని అర్చన అనడం చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది.

కొందరి ప్రవర్తన కారణంగానే ఏడ్చాను..

కొందరి ప్రవర్తన కారణంగానే ఏడ్చాను..

దాంతో హరితేజ నీవు ఇక్కడికి వచ్చి ఇటు కూర్చో. నాకు పొగ వచ్చిన పర్వాలేదు అని నేను అన్నాను. అందుకు జవాబుగా చూస్తే చిన్నపిల్లలా ఉంది. కానీ పొగరుగా బిహేవ్ చేస్తున్నది అని అర్చన అనడంతో ఏడుపు వచ్చింది. అందుకే ఏడ్చాను. బిగ్‌బాస్ హౌస్‌లో కొందరి ప్రవర్తన బాధ కలిగింది.

 అర్చన నాతో దారుణంగా..

అర్చన నాతో దారుణంగా..

ఓ వైపు చెల్లెలు అంటూనే అర్చన నాతో చాలా దారుణంగా ప్రవర్తించింది. నా గురించి ఏదో మాట్లాడుకుంటూ చెవులు కొరుక్కునే వారు. బిగ్‌బాస్ హౌస్‌లో కొందరి ప్రవర్తన వల్ల నేను చాలా బాధపడ్డాను. వారి మైండ్ సెట్‌ వల్ల హౌస్‌లో అడ్జస్ట్ కాలేకపోయాను. అంతేకాకుండా కుటుంబం కూడా గుర్తుకొచ్చింది. స్వేచ్ఛగా ఉండే దానిని. బిగ్‌బాస్‌లో బంధించినట్టు అయిందనిపించింది. అందుకే బయటకు రావాలనుకొన్నాను.

వారితో మంచి రిలేషన్స్

వారితో మంచి రిలేషన్స్

కొద్ది రోజుల తర్వాత చాలా మందితో మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత వారే ఇంటి నుంచి వెళ్ల వద్దని అడిగారు. ఒకసారి నేను వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాను. అందుకే బయటకు వచ్చాను. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు బాధలేదు

వైల్డ్ కార్డు అవకాశమొస్తే వెళ్తాను..

వైల్డ్ కార్డు అవకాశమొస్తే వెళ్తాను..

మళ్లీ వైల్డ్ కార్డు ద్వారా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తాను. ఎందుకంటే నాకు హౌస్‌లో ఎలా ఉండాలో నాకు ఇప్పుడు బాగా తెలుసు. ఇంటిలో ప్రతీ విషయం, ప్రతీ వ్యక్తి ప్రవర్తన నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఒకవేళ అవకాశం వస్తే చాలా మంచి గేమ్‌ను ఆడటానికి అవకాశం ఉంటుంది.

ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

బిగ్‌బాస్ ఇంటికి వెళ్లకు ముందు.. బయటకు వచ్చిన తర్వాత తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నన్ను ఎవరైనా బాధపడితే నేను ఏడుస్తాను. ఎందుకంటే వారిని నేను బాధపెట్టలేను.
కల్పనకు సేవకురాలిగా అర్చనను నియమించి ఆమెపై ఉన్న కసిని, పగను తీర్చుకొన్నానని అనడం సరికాదు. కానీ ఆమెపై కోపం ఉన్న మాట వాస్తవమే. కల్పనను అందరూ టార్గెట్ చేశారు. ఆమెకు మంచి చేయాలని అర్చనను సేవకురాలిగా నియమించాను.

English summary
Singer Madhupriya eliminated from the biggboss house recently. Her song in Fidaa got good response too. In this juncture, Madhupriya speaks with local Television Channel with her mind. Madhupriya told so many things about her experiences in Biggboss house. She said that she was targetted by actor archana in house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu