twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు మీద ఫోకస్ పెట్టిన సోనీ లివ్... హెడ్గా ప్రముఖ తెలుగు నిర్మాత నియామకం!

    |

    తెలుగు భాష మీద దాదాపుగా అన్ని ఓటీటీ సంస్థలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి.. ఏకంగా అల్లుఅరవింద్ అయితే తెలుగులోనే మొట్టమొదటి ఓటీటీ అంటూ ఆహా సంస్థను నెలకొల్పిన సంగతి కూడా తెలిసిందే.. ఇప్పుడు అదే కోవలో ఒక అంతర్జాతీయ సంస్థ తెలుగు కంటెంట్ మీద ఫోకస్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే టాలీవుడ్ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డికి అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఎంటర్టైన్మెంట్ లో లెజెండ్ గా పేరున్న కంపెనీ సోని తన ఓటీటీ సోని లివ్ కి తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డిని నియమించుకుంది.

    ఈ సందర్భంగా సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోని లివ్ కంటెంట్ హెడ్ ఆశిష్ గోల్వాకర్ మాట్లాడుతూ తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి చేయి కలపడం సంతోషంగా ఉందని అన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సోని లివ్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో "సోని లివ్" కు ఉన్న లెగసీని తెలుగులో మరింత ముందుకు తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తానని ఆయన అన్నారు.

    Madhura Sridhar Reddy Appointed As SonyLIV OTT Telugu Content Head

    మన తెలుగులోని వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ఆడియెన్స్ ఆదరించేలా తీసుకొస్తామని ఆయన అన్నారు. ఇక మధుర శ్రీధర్ రెడ్డి చానాళ్ళగా టాలీవుడ్ లో దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, మధుర మ్యూజిక్ లేబుల్ ఓనర్ గా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాలకు దర్శకుడి గా వ్యవహరించారు. అలాగే ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్, ఒక మనసు, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, ఏబిసిడి, దొరసాని, లవ్ లైఫ్ అండ్ పకోడీ లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.

    English summary
    SonyLIV has appointed Sreedhar Reddy Komalla as head – Telugu content, digital business. he is going to focus on telugu content
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X