For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టీవిలో 'శ్రీమంతుడు' : హారతులు,పూజలతో మహేష్ ఫ్యాన్స్ (ఫొటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాధారణంగా సినిమా రిలీజ్ రోజున ...అభిమానులు తమ హీరోకు ధియోటర్లలో హారతులివ్వటం వంటివి కామన్. అయితే ఇప్పుడు టీవిల్లో వస్తున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో రికార్డులు క్రియేట్ చేసింది.

  తాజాగా ఈ చిత్రం ఆదివారం అంటే నిన్నటి రోజున జీ తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ షో వేసారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఇదిగో ఈ క్రింద ఫొటోలో చూపినట్లుగా ఆనందంగా ఊగిపోయారు.

  స్లైడ్ షోలో ...ఆ ఫొటోలు చూడండి

  స్క్రీన్స్ వేసి మరీ..

  స్క్రీన్స్ వేసి మరీ..

  కొన్ని చోట్ల అభిమానులు ఇదిగో ఇలా స్పెషల్ గా రోడ్డుపై స్కీన్స్ ఏర్పాటు చేసి మరీ సినిమాని చూసారు.

  మరో ప్రక్క...

  మరో ప్రక్క...

  మహేష్ ..మరికొద్ది సేపట్లో సినిమా టీవిలో ప్రారంభమవుతుందనగా ట్వీట్ చేసి మరీ గుర్తు చేసారు.

  ట్వీట్ ఎఫెక్ట్

  ట్వీట్ ఎఫెక్ట్

  మహేష్ ట్వీట్ ఎఫెక్ట్ తో ఓ రేంజిలో స్పందన వచ్చింది. అందరూ టీవి ల దగ్గర చేరిపోయారు

  ఇదో రికార్డ్

  ఇదో రికార్డ్


  టీఆర్పీలు కూడా ఓ రేంజిలో ఉంటాయని చెప్పుకుంటున్నారు.

  కాన్సెప్టు అదుర్స్

  కాన్సెప్టు అదుర్స్

  మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ...

  దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ...

  "ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని మేం కష్టపడిన దానికంటే ఎక్కువ సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఫ్యాన్స్‌కి మా టీమ్ తరఫున స్పెషల్ థ్యాంక్స్. '' అన్నారు.

  నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ...

  నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ...

  "మా బ్యానర్‌లో నిర్మించిన మొదటి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇది. మహేశ్, కొరటాల శివ గారికి స్పెష్ థాంక్స్. రాజకీయనాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, స్టార్స్ అందరూ ఈ చిత్రాన్ని చూశారు. ఈ వారంలో సచిన్ టెండూల్కర్ కూడా చూస్తానన్నారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్‌కు చాలా చాలా థ్యాంక్స్'' అని అన్నారు.

  English summary
  Srimanthudu was premiered on Television last night in Zee Telugu and Mahesh fans, who caught up with the movie, made movie goers experience the mass hysteria of Mahesh Babu. Some of the die hard fans performed special poojas to TV when Mahesh appeared on screen and the pictures of lady fans offering harathi to Mahesh are now doing rounds on the internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X