»   » మలయాళ నటి లైంగిక దాడి కేసు: డ్రైవర్ తో సంబంధం పెట్టుకుందంటూ టీవీ ఛానెల్ తప్పుడు కథనం,

మలయాళ నటి లైంగిక దాడి కేసు: డ్రైవర్ తో సంబంధం పెట్టుకుందంటూ టీవీ ఛానెల్ తప్పుడు కథనం,

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: భాధ్యతగా వ్యవహరిస్తూ సమాజానికి దారి చూపించాల్సిన మీడియా, టీవి చానెల్స్ ఒక్కోసారి ఏం ప్రసారం చేస్తున్నామో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆలోచించుకోవటం లేదు. రీసెంట్ గా
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి సంఘటనకు సంబంధించి అధికార సీపీఎంకు చెందిన 'కైరాలి' టీవీ ఛానెల్ ప్రసారం చేసిన కథనాలపై విమర్శలు వెల్లువెత్తాయి.

కిడ్నాప్ నకు సూత్రధారిగా వ్యవహరించిన కారు డ్రైవర్ తో హీరోయిన్ కు సంబంధం ఉందంటూ.. ఎలాంటి ఆధారాలు లేని ఓ కథానాన్ని సదరు ఛానెల్ ప్రసారం చేసింది. దీనిపై, ఆమె అభిమానులు మండిపడుతున్నారు. లైంగిక దాడికి గురైన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధనను ఆ ఛానెల్ తుంగలో తొక్కిందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Malayalam Actress Bhavana Assault: Kairali TV Slammed for Insensitivity

టీవీలో ఈ ప్రసారాలపై నటుడు పృథ్వీరాజ్, నటి రిమా కల్లింగల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ పి రేటింగ్స్ కోసం తప్పుడు కథనాలు ప్రచురించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీంతో, 'కైరాలీ' యాజమాన్యం క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది

మలయాళ నటిపై కొందరు దాడి చేసిన ఘటనను మలయాళ సినీ పరిశ్రమ ముక్తకంఠంతో ఖండించింది. శనివారం జరిగిన దాడిపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. దీంతో ఆదివారం అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.

అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మూవీ ఆర్టిస్ట్స్‌) అధ్యక్షుడు ఇన్నోసింట్‌ మాట్లాడుతూ ఇది దారుణమైన నేరమన్నారు. మన కుటుంబంలోని ఒక మహిళపై దుర్మార్గులు దుర్మార్గంగా ప్రవర్తించారని తెలిపారు. కేసు విచారణ వివరాలను సీఎం విజయన్‌, డీజీపీని అడిగి తెలుసుకున్నారు.

భగవంతుని సొంత రాజ్యమని చెప్పుకొనే కేరళలో మహిళాస్వామ్యం ఉంది. అయినా ఇలాంటి ఘటన జరగడం సమాజానికి సిగ్గుచేటని హీరో పృథ్వీరాజ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మరో వారం రోజుల్లో ఆమెతో కలిసి ఒక సినిమాలో నటించాల్సి ఉందని తెలిపారు. బాధితురాలు ఇంకా షాక్‌లోనే ఉన్నారని నటి మంజు వారియర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఆమె ధైర్యం కోల్పోలేదన్నారు.

దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని దర్శకుడు మనోజ్‌ రవి ప్రభుత్వాన్ని కోరారు. సెలబ్రిటీలకే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

బాధితురాలికి న్యాయం జరిగేంతవరకు సినీపరిశ్రమ పోరాడాలని పిలుపునిచ్చారు. దాడికి గురైన నటి ఆ వివరాలను వెల్లడించినందుకు నటుడు ఉన్ని ముకుందన్‌ ప్రశంసించారు. ఆ నటి గుండె ధైర్యమున్న యువతి అని అన్నారు.

English summary
Kairali TV, a CPI (M) affiliated Malayalam news channel faced huge criticism after they aired 'details' of the alleged Bhavana rape.But what angered people more was that the channel insinuated a relationship between the actor and the driver who engineered the attack.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu