»   » రికార్డు ధర: ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ శాటిలైట్ రేటు

రికార్డు ధర: ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ శాటిలైట్ రేటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కె.యస్‌.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొంది విడుదలైన సినిమా ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మించారు. సినిమా శాటిలైట్ రైట్స్ ని మా టీవీ వారు 4.15 కోట్లకి సొంతం చేసుకున్నారు. శర్వానంద్ కెరీర్లోనే మొదటిసారిగా అత్యంత భారీ రేటుకి శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి ఈ రేంజ్ రేటు రావడంతో ప్రొడక్షన్ టీం చాలా హ్యాపీ గా ఉంది. ఇది రికార్డే అని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
చిత్రం కథేమిటంటే... రన్నర్... రాజారాం(శర్వానంద్) జీవితాశయం నేషనల్ లెవిల్లో గోల్డ్ మెడల్. ఆ సాధన చేస్తూ ఖాళీ సమయంలో ... తన కాలేజీలో చదివే ముస్లిం అమ్మాయి నజీర(నిత్యామీనన్) ని ప్రేమిస్తాడు. మతాలు వేరైనా మనస్సులు కలిసాయని ఇద్దరూ ప్రేమని కంటిన్యూ చేస్తారు...అంతేకాక ఆమె తన ముఖం చూపకుండా అతని లక్ష్యానికి అన్ని విధాలా సాయబడి అతని ఆశయం నెరవేరేలా చేస్తుంది. ఇక వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకునే సమయంలో అనుకోని పరిస్ధితుల్లో విడిపోతారు.

Malli Malli Idhi Rani Roju’s satellite rights sold

విధికి తలొగ్గి తమ ప్రేమను సాఫల్యం చేసుకోలేకపోయిన ఈ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం చివరకు ఏ తీరాలకు చేరింది? తర్వాత ఏం జరిగింది. అసలు వీరు విడిపోయే పరిస్ధితులు ఏమి వచ్చాయి ..ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే చిత్ర కథ

మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్ మా చిత్రానికి బాణీలు అందించారు. అందమైన ప్రేమకథగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమాకు కెమెరా: జ్ఞానశేఖర్‌.వి.యస్‌., మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
satellite rights of Sharwanand latest film, Malli Malli Idhi Rani Roju have been sold for a whopping 4.15 crores to Maa TV.
Please Wait while comments are loading...