»   » మంచు లక్ష్మి టీవీ షోలో మీరు నటించాలంటే...?

మంచు లక్ష్మి టీవీ షోలో మీరు నటించాలంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరస టీవీ షో లతో అదరకొడ్తున్న మంచు లక్ష్మి టాలెంట్ హంట్ నిర్వహిస్తోంది. తమ కొత్త టీవీ షో కోసం కామెడీ పండించగల నటులను అన్వేషిస్తోంది. వాటిలో మీకు నటించాలని ఉంటే... మీరు చేసిన ఒక నిముషం స్క్రిట్ ని, మీ ఫోటోలతో కలిపి ఆమె ఐడీకి పంపండి.

ఆమె మెయిల్ ఐడీ... manchu.talent@gmail.com

ఇక ప్రస్తుతం ఆమె దూసుకెళ్తా అనే టీవీ షో చేస్తోంది. అలాగే చందమామ కథలు చిత్రంలో చేస్తోంది. మంచు లక్ష్మి ప్రసన్న సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు తదితరులు ప్రధాన తారాగణంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చైతన్య బూనేటి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రం టీజర్స్ ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్నాయి.

Manchu Lakshmi talent hunt

ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో సినిమాకు సంబంధించిన న్యూస్టిల్స్ విడుదల చేసారు. ఇందులో మంచు లక్ష్మి మందుకొడుతున్నట్లు ఉన్న సన్నివేశాలు.... సినిమా ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తిని రేపుతున్నాయి. 'చందమామ కథలు' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఒక ప్రవక్త అన్నాడు, జీవితంలోజరిగేవరుస సంఘటనలు మనలోఒక నమ్మకానికి దారితీస్తాయి, ఒక్కసారి ఆ నమ్మకం నిజమనిబలంగా విశ్వసిస్తే, ఆ నిజాన్నిబతికించడానికి ప్రపంచం నీకోసం సంభవిస్తుంది అని. అయితే ఆ నమ్మకాన్ని ఎంత బలంగా నమ్మగలం? నమ్మిన దానికోసం ఎంత పనంగా పెట్టగలం, ఎంత దూరం వెళ్ళగలం? అంతర్లీనమైన ఈ నిరంతర మానసిక సంఘర్షణ తో పాటు అనంతమైన విశ్వంలో మన ఆధీనంలోనే ఉంది అనుకుంటున్న మన నలుసంత జీవితాన్ని ఒక రచయిత ద్వారా ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ "చందమామ కథలు".

English summary
Looking for actors with comedic talent for a tv show. Pls send a one min skit with your pictures to manchu.talentgmail.com - Lakshmi Manchu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu