»   » రాజమౌళికి కోపం వస్తుందనే ప్రభాస్ ని పిలవలేదు

రాజమౌళికి కోపం వస్తుందనే ప్రభాస్ ని పిలవలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పటి వరకూ నేను హీరో ప్రభాస్ ని నా షో 'మేము సైతం' కి పిలవలేదు. ఎందుకంటే ఆయన 'బాహుబలి ' షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. మళ్ళీ పిలిస్తే రాజమౌళిగారికి కోపం వస్తుంది. అందుకే ఆయన్ను ఇప్పటివరకూ పిలవలేదు అంటూ చెప్పుకొచ్చారు మంచు లక్ష్మి. ఆమె గత కొంతకాలంగా 'మేము సైతం' అనే పోగ్రామ్ చేస్తున్నారు. ఆ పోగ్రామ్ కు సినీ సెలబ్రెటీలను అందరినీ పిలుస్తూ వస్తున్నారు. ఆ షో గురించి ఆమె తన పుట్టిన రోజు సందర్బంగా మీడయాతో మాట్లాడుతూ ముచ్చటించారు.

అలాగే...దాదాపు అందరినీ నా షోకి పిలిచాను. రాని వాళ్ళు చాలామందున్నారు. కొందరు వస్తామని చెప్పి రానివాళ్లున్నారు. ఎందుకో వాళ్ళు మీరు మీలా ఉండండి అంటే భయపడతారు. రానివాళ్ళకి సహాయం చేసే అదృష్టం లేదనే అనుకుంటాను అని చెప్పుకొచ్చారామె.

ఇక పలానా సెలబ్రటీ షో చేస్తే ఎక్కువ ఫండ్స్ వస్తాయి. వాళ్ళతోనే చేయాలి అని అనుకోలేదు. సహాయం ఎవరు చేసినా సంతోషమే. నా షోకి వచ్చిన వాళ్లంతా షో పూర్తయ్యాక ఇస్తామన్న టైమ్ కి డబ్బులు ఇచ్చేశారు. అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు అని చెప్పుకొచ్చారామె.

Manchu laxmi about her show Memu Saitham

మొదట 'మేము సైతం' ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు నేను పదిమందికి హెల్ప్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉండేది. కానీ ప్రోగ్రామ్ చేశాక వాళ్ళే నాకు హెల్ప్ చేస్తున్నారు అనిపిస్తోంది. మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా తయారయ్యాను. భాధలు ఎలా ఉంటాయో, సహాయం ఎలా చేయాలో తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చారామె.

మంచు లక్ష్మి తాజా చిత్రం విశేషాలకు వస్తే... మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన 'లక్ష్మీ బాంబ్‌'. ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'లక్ష్మీ బాంబ్‌' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ..' న్యాయమూర్తి పాత్రలో నటిస్తున్నాను. నేను ఇప్పటిదాకా చేసిన పాత్రల్లో ఎక్కువ ఎంజాయ్‌ చేస్తున్న క్యారెక్టర్‌ ఇది. కష్టమైన పాత్ర కూడా ఇదే. సింగిల్‌ షెడ్యూల్‌ సినిమా పూర్తి చేశాం. దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. క్లైమాక్స్‌ కోసం మనోజ్‌ కంపోజ్‌ చేసిన స్టంట్స్‌ ఆకట్టుకుంటాయి.' అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ..' ఇవాళే షూటింగ్‌ ప్రారంభించాం అన్నట్లుంది. ఇంతలోనే సినిమాను పూర్తి చేశాం. నటీనటులు, యూనిట్‌ సహకారంతో సింగిల్‌ షెడ్యూల్‌ లో షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచు లక్ష్మీ ప్రసన్న నటన సినిమాకు ప్రధానాకర్షణ అవుతుంది. సెప్టెంబర్‌ లో ఆడియోను విడుదల చేస్తాం. వెలుగుల పండగ దీపావళికి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.' అన్నారు.

English summary
Manchu laxmi said that she is very happy with Memu Saitham programme. Manchu Lakshmi Prasanna, who proved herself on the small screen with her shows like Prematho Mee Lakshmi, Luckunte Lakshmi and Boom Boom, is all set to host a new show Memu Saitham. It is a TV show that helps the common man, who struggle to achieve their dreams with an undying spirit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu