»   »  నా భర్త తో సంభంధం,తెలుగు టీవీ యాంకర్ పై భార్య కేసు

నా భర్త తో సంభంధం,తెలుగు టీవీ యాంకర్ పై భార్య కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్రమ సంభంధాలు,సహ జీవన విధానాలు గ్లామర్ ఫీల్డ్ లో అత్యంత సహజమవుతున్నాయి. అయితే అవి దారి తప్పి, సక్రమంగా నడుస్తున్న కుటుంబాలను రోడ్డు మీద లాగినప్పుడే, అవి అందరి కళ్ళలో పడతాయి.

ఇలాగే ప్రముఖ టీవి సీరియల్ దర్శకుడు మధుకర్ పర్శనల్ వ్యవహారం రోడ్డు మీదకు వచ్చింది. తన సంసారం కూలిపోయిందంటూ అతని భార్య మానవ హక్కుల కమీషన్ ని కలవటంతో మీడియా ముందుకు ఈ సమస్య వచ్చింది.

తన భర్తను రెండో వివాహం చేసుకొని తనను వేధిస్తున్న టీవీ యాంకర్, సీరియల్ నటిపై చర్యలు తీసుకోవాలని మొదటి భార్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇందుకు స్పందించి హెచ్‌ఆర్సీ జూన్ 13వ తేదీలోగా విచారణ నివేదిక కమిషన్‌కు అందజేయాలని బాలానగర్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది. మోతీనగర్ ప్రాంతానికి చెందిన జి. సీత(న్యాయవాది) హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసిన...అనంతరం విలేకరులతో మాట్లాడారు.

Married TV Director Madhukar's Illicit Affair With TV Anchor Geetha Bhagath

తనకు టీవీ సీరియల్ డైరెక్టర్ మధుకర్‌తో 2002లో వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం ఉన్నారని తెలిపారు. తన భర్త విడాకులు ఇవ్వకుండానే టీవీ యాంకర్, సీరియల్ నటి గీతాభగత్‌ను రెండో వివాహం చేసుకున్నాడని చెప్పారు. అప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని పేర్కొన్నారు.

పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకొని వేరుగా ఉంటున్నామని భర్త తాము ఉంటున్న ఇంటిని తన కుమారుని పేరుపై గిఫ్ట్‌డీడ్ రాశాడని చెప్పారు. వారు అదే ఇంటి పై అంతస్తులో ఉంటుండగా తాము కింది భాగంలో ఉంటున్నట్లు పేర్కొన్నారు.

ఇటీవల గీతా భగత్ ఇల్లు తన పేరు మీద ఉందని, రాత్రి వేళల్లో గేటుకు తాళం వేసి ఇబ్బందులకు గురి చేయడంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తోందని ఆరోపించారు.

ఈ విషయమై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులకు పాల్పడుతున్న భర్త మధుకర్, గీతాభగత్, ఆమె తల్లిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది.

English summary
Wife of the popular TV serial director Madhukar approached the State Human Rights Commission against her husband for abandoning her and torturing her mentally. The wife further alleged that Madhukar has deserted her completely and that he has been living in with his girlfriend and popular TV anchor and small-time actress Geetha Bhagath since a long time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu