Bigg Boss 9 Telugu Top 5 Contestant: బిగ్‌బాస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు వీరే.. రియల్ గేమర్స్ వాళ్లే
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ అంచనాలను మించి రెస్పాన్స్ అందుకొంటున్నది. గడచిన రెండు వారాల్లో అనేక వివాదాలు, ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. అయితే ఊహించని విధంగా కొందరు నామినేషన్‌లోకి రావడం.. అంతే ట్విస్టుతో కొందరు టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం షాకింగ్‌గా మారింది. అయితే రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మర్యాద మనీష్ ఇంటిలో జరిగిన విషయాలను, ప్రస్తుతం జరుగుతున్న గేమ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ షోలో రెండోవారంలోనే ఎలిమినేట్ కావడం షాకింగ్ విషయం. నేను ఊహించలేదు. నేను ఫ్లోరా సైనీ నామినేషన్‌లో ఉన్నప్పుడు ఆమె ఎలిమినేట్ అవుతుందని భావించాను. కానీ నేను ఎలిమినేట్ కావడం ఊహించలేదు. పబ్లిక్ నాకు ఓట్లు వేయకపోవడం, నాకు సంబంధించిన కంటెంట్ బయటకు రాకపోవడమే అందుకు కారణం అని భావిస్తున్నాను అని మర్యాద అన్నారు.

నేను గేమ్ స్ట్రాటజీ గురించే ఆలోచించాను. జనం వేసే ఓట్ల గురించి మరిచిపోయాను. ఆ తర్వాత ఓట్లు రావాలంటే.. కంటెంట్ ఇవ్వాల్సిందే అనే విషయాన్ని గ్రహించాను. సెలబ్రిటీలకు, మాకు ముఖ్యంగా భరణితో నా డిబేట్స్ బాగా జరిగాయి. ఇంట్లో కొందరు చిల్లరగా బిహేవ్ చేస్తున్నారనే కామెంట్‌ను ఆయన సమర్ధించుకొన్నారు. అందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదు అని అన్నారు.
కామన్ మ్యాన్ ఇంటిలోకి వెళ్లిన తాను.. కప్ గెలువాలనే అనుకొన్నాను. ఆ లక్ష్యంతోనే ఉన్న రెండు వారాల్లో గట్టిగా పోరాటం చేసి ఆట తీరును ప్రదర్శించాను. ఇంట్లో అందరికంటే ఎక్కువగా నేనే పోరాటం చేశాను. నేను ఎలిమినేట్ కాకుండా ఉంటే.. టాప్ 5 కంటెస్టెంట్ అయి ఉండే వాడిని. కానీ నా ఆట తీరుతో జనం నుంచి ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నంలో విఫలమయ్యాను అని మర్యాద మనీష్ అన్నారు.
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో కంటెస్టెంట్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. నా దృష్టిలో టాప్ 5 స్థానాలకు భారీ పోటీ ఉంటుంది. టాప్ 5 పొజిషన్స్‌లో నిలిచే వారిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్, హరిత హరీష్, సంజన గల్రానీ నలుగురు టాప్ 4లో చేరే అవకాశం ఉంది. టాప్ 5 స్థానం కోసం తనూజ, రాము రాథోడ్, రీతూ చౌదరీ లాంటి వాళ్లు పొటీపడే అవకాశం ఉంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బిగ్‌బాస్ ఇంటిలో నా దృష్టిలో ఇద్దరు రియల్ గేమర్స్ ఉన్నారు. వారిలో ఇమ్మాన్యుయేల్, సంజన ఒకరు. వాళ్లిద్దరూ గేమ్‌ను బాగా ఆడుతున్నారు. వారి స్ట్రాటజీ బాగుంది అని చెప్పారు. ఒకవేళ మళ్లీ అవకాశం ఉంటే.. బిగ్‌బాస్ షోలోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నాను. ఎలిమినేషన్ తర్వాత ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత జనం గుర్తుపట్టి..ఫాలో అవుతున్న తీరు చూసిన నాకు మంచి గుర్తింపు వచ్చిందనే ఆనందం కలిగింది అని మర్యాద మనీష్ అన్నారు.


Click it and Unblock the Notifications











