»   » చిరంజీవి షో: కోటీశ్వరుడు కావడానికి రిజిస్ట్రేషన్స్ షురూ!

చిరంజీవి షో: కోటీశ్వరుడు కావడానికి రిజిస్ట్రేషన్స్ షురూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమో కూడా ఇటీవల రిలీజైంది. చిరంజీవితో షో కావడంతో ఈ కార్యక్రమంపై అంచనాలు మరింత పెరిగాయి.

కాగా... మీలో ఎవరు కోటీశ్వరు 4వ సీజన్లో అవకాశం దక్కించుకోవాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా చిరంజీవి అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

మీరు సరైన సమాధానం చెబితే....ఈ కార్యక్రమం ఎంపిక ప్రక్రియలో మీరు ఒక మెట్టు ఎక్కినట్లు అవుతుంది.

అక్టోబర్ 11, రాత్రి 7 గంటలకు

ఒక పదకొండ తేదీ మొదటి సారి కెమెరా ముందు నిలబడ్డ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ 11వ తేదీ మొదటి ప్రశ్నకు మీరిచ్చే రైట్ ఆన్సర్ మిమ్మల్ని ఏ రేంజికైనా తీసుకెళ్లగలదు. అక్టోబర్ 11 మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం నా మొదటి ప్రశ్న మీ ముందుకొచ్చే రోజు. డోంట్ మిస్ రాత్రి 7 గంటలకు... అంటూ చిరంజీవితో ప్రోమో రిలీజ్ చేసారు.

ప్రోమో అదిరింది

ఒక విజయ దశమి నన్ను మీ గుండెళ్లో ఖైదీని చేసింది. మరో విజయదశమి మీ మనసుల్లో విజేతగా నిలిపింది. మరో విజయదశమి రౌడీ అల్లుడును మాస్టర్ గా మార్చింది. ఈ విజయదశమి మీ జీవితాన్ని మార్చే సుముహూర్తం కాబోతోంది. అక్టోబర్ 11, రాత్రి 7 గంటలకు మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం నా మొదటి ప్రశ్న. సిద్ధంగా ఉండండి అంటూ మరో ప్రోమో రిలీజ్ చేసారు.

మిమ్మల్ని గెలిపించడానికి

‘వెండితెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లి తెర మీద మిమ్మలని గెలిపించటానికి వస్తున్నాను. కమాన్. లెటజ్ ప్లే ‘ అంటూ మీలో ఎవరు కోటీశ్వరుడులో చిరంజీవి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

విజిల్ ప్రోమో

ఈ షో 1డిసెంబర్ 2 నుండి మాటీవీలో ప్రసారం కానుంది.

English summary
Meelo Evaru Koteeswarudu registration on october 11th. Watch Mega Star Chiranjeevi Meelo Evaru Koteeswarudu Promo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu