twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌కు చిరు, నాగ్ మాట సాయం.. యంగ్ టైగర్‌ పేరు సిఫారసు.. ఏం జరిగిందంటే..

    ఇప్పటివరకు వెండితెరపైనే సందడి చేసిన ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెర మీద కూడా మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతున్నాడు.

    By Rajababu
    |

    టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌ చిత్రాలతో జూనియర్ ఎన్టీఆర్ హ్యాట్రిక్ సాధించాడు. వరుస విజయాల తర్వాత విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకొని జై లవకుశతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు వెండితెరపైనే సందడి చేసిన ఎన్టీఆర్ తొలిసారి బుల్లితెర మీద కూడా మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతున్నాడు. దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ చూరగొన్న బిగ్‌బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రానున్నది. తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.

    సల్మాన్, కమల్ బాటలో యంగ్ టైగర్..

    సల్మాన్, కమల్ బాటలో యంగ్ టైగర్..

    బిగ్‌బాస్ ‌హిందీ వెర్షన్‌‌కు ఎప్పటి నుంచో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళ వెర్షన్‌కు కమల్ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా సల్మాన్, కమల్ బాటలో జూనియర్ ఎన్టీఆర్ నడువటం గమనార్హం. బిగ్ బాస్ తెలుగు వెర్షన్‌కు తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    లుక్స్, భాష, బాడీ లాంగ్వేజ్..

    లుక్స్, భాష, బాడీ లాంగ్వేజ్..

    లుక్స్, భాషపై పట్టు అవన్నీ ఎన్టీఆర్‌‌కు అదనపు బలంగా మారాయి. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజీ కూడా మరో ఆకర్షణ. పలు వేదికల మీద జూనియర్ తన వాక్చాతుర్యంతో అదరగొట్టేశాడు. అంతేకాకుండా తారక్‌కు విశేష ప్రేక్షకాదరణ ఉంది. ఇవన్నీ బిగ్‌బాస్‌ తెలుగు వెర్షన్‌కు సానుకూలంగా మారుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

    జై లవకుశలో త్రిపాత్రాభినయం..

    జై లవకుశలో త్రిపాత్రాభినయం..

    మూడు విభిన్న పాత్రలతో ‘జైలవకుశ' సినిమాతో యంగ్‌టైగర్‌ ఎన్టీయార్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత బిగ్‌బాస్ కార్యక్రమం కోసం ఎన్టీయార్‌ కాస్త గ్యాప్‌ తీసుకోబోతున్నారట. ఈ ప్రోగ్రామ్‌ను హోస్ట్‌ చేస్తున్నందుకుగానూ ఎన్టీయార్‌కు భారీ మొత్తం ‘స్టార్‌ మా' ఛానెల్‌ ముట్టజెప్పినట్టు సమాచారం. పారితోషికం వివరాలు బయటకు రానప్పటికీ.. కళ్లు తిరిగే మొత్తాన్ని ఎన్టీఆర్‌కు సదరు ఛానెల్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

    చిరు, నాగ్ మాట సాయం..

    చిరు, నాగ్ మాట సాయం..

    అసలు జూనియర్ ఎన్టీఆర్‌ చేత ఓ టీవీ ప్రోగ్రామ్‌ చేయించాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసా? బిగ్ బాస్‌ హోస్ట్‌గా వ్యవహరించడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున. ‘బిగ్‌బాస్‌' షోను తెలుగులో చేయాలనుకుంటున్నప్పుడు ఎన్టీఆర్‌ పేరును యాజమాన్యానికి చిరు, నాగ్‌ సూచించారట. ఈ ఇద్దరికీ ఎన్టీఆర్‌ సన్నిహితుడనే విషయం తెలిసిందే.

    స్టార్ మా టీవీతో ఇంకా అనుబంధం..

    స్టార్ మా టీవీతో ఇంకా అనుబంధం..

    ‘మా' టీవీ ఛానెల్‌ను ‘స్టార్‌' కోనుగోలు చేయకముందు దానిని నాగార్జున, చిరంజీవి నిర్వహించేవారు. ఇప్పుడు ‘స్టార్‌' చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత కూడా నాగ్‌, చిరుకు కొత్త యాజమాన్యంతో మంచి అనుబంధమే ఉంది. అందుకే వారిద్దరూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ చేసిన సంగతి తెలిసిందే.

    English summary
    Young Tiger NTR is now ready perform his talent on Small screen. He has given green signal for Bigboss Telugu version on Star Maa TV. Reports suggest that Megastar Chiranjeevi, Nagarjuna suggested NTR name for Bigboss Telugu version.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X