Just In
- 6 hrs ago
ట్రెండింగ్ : కొంచెం కూడా ఇంగితజ్ఞానం లేదా.. పైకి కనపడేది నిజం కాదు.. మళ్లీ బుక్కైన నాగబాబు
- 7 hrs ago
నా దినచర్య అదే.. పొద్దు పొద్దున్నే ఆ పని.. భర్తతో కాజల్ రచ్చ!!
- 8 hrs ago
నా గురించి ఆలోచిస్తున్నావా?.. నాగచైతన్య పోస్ట్‌పై సమంత ఫన్నీ కామెంట్స్
- 9 hrs ago
VD 10.. ప్రీ లుక్‌తో విజయ్ దేవరకొండ రచ్చ.. రేపే అసలు కథ!
Don't Miss!
- News
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప.. ఏదైనా అడగండి: కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
- Finance
పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా తగ్గినా.. ఆదాయం అదుర్స్: ఎందుకంటే
- Sports
సెహ్వాగ్ చెప్పిన ప్రకారం గబ్బాలో భారత్‌దేనా విజయం..?
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గంగవ్వ ఎమోషనల్ స్టోరీ.. మర్చిపోకుండా కోరిక నెరవేర్చిన మెహబూబ్.. నేనున్నానవ్వా అంటూ..
బిగ్ బాస్ సీజన్ 4కు మరో మూడు రోజుల్లో ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక షో ముగిస్తే బయట అసలు రచ్చ మొదలవుతుంది. కంటెస్టెంట్స్ అందరు కూడా మళ్ళీ బయట ప్రపంచంలో గడపబోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఈ సారి బిగ్ బాస్ లోకి విభిన్నమైన కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఎక్కువగా డిజిటల్ మీడియాకు చెందిన స్టార్డ్ ను కంటెస్టెంట్స్ గా ఇన్వైట్ చేశారు. ఇక మెహబూబ్ గంగవ్వను ఇటీవల ఇంటికి పిలిచి ఒక ప్రత్యేకమైన కానుక ఇచ్చాడు.

గొడవలు ఎన్ని జరిగినా..
బిగ్ బాస్ లో గోడవలు ఎన్ని జరిగినా కూడా ఎక్కడో ఒక చోట కంటెస్టెంట్స్ మధ్య స్నేహ భావం అనేది ఉంటుంది. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న వారిని చూస్తుంటే ఆ విషయం ఈజీగా అర్ధమవుతుంది. ఇప్పుడున్న వారిలో అందరికి మనస్పర్థలు వచ్చినప్పటికీ వీలైనంత వరకు నార్మల్ టైమ్ లో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు..

మెహబూబ్ ఇంటికి గంగవ్వ
ఇక కొన్నిరోజుల క్రితం బయటకు వచ్చిన వారు ప్రత్యేకంగా కలుసుకుంటు స్పెషల్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఇక మెహబూబ్ దిల్ సే ఇటీవల గంగవ్వను అలాగే జోర్దార్ సుజాతను ప్రత్యేకంగా ఇంటికి పిలిచాడు. మెహబూబ్ వారితో చాలా సేపు బిగ్ బాస్ కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వించాడు.

బిగ్ బాస్ గంగవ్వ షాకింగ్ కామెంట్స్ ..
బిగ్ బాస్ చివర్లో వచ్చినప్పుడు గంగవ్వ అంత ఎనర్జీగా కనిపించేది కాదని అయితే ఇప్పుడు మాత్రం చాలా హుషారుగా కనిపిస్తోందని మెహబూబ్ చెప్పడంతో గంగవ్వ కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చింది. ఏ పని లేకుండా బిగ్ బాస్ లో ఉండడం నాకు నచ్చలేదు అంటూ చిన్న చిన్న డ్రెస్సులు కూడా కొంతమంది వేసుకోవడం బాగోలేదని కామెంట్ చేసింది.

గంగవ్వకు స్పెషల్ గిఫ్ట్
మెహబూబ్ తన ఇంట్లోనే గంగవ్వకు, సుజాతకు స్పెషల్ గా వంట చేసి పెట్టాడు. ఇక చివరలో ఇద్దరి మధ్య ఒక గేమ్ పెట్టాడు మెహబూబ్. అద్దం లేకుండా మేకప్ వేసుకోవాలని సుజాత, గంగవ్వకు మధ్య పోటీ పెట్టాడు. అప్పుడు గంగవ్వ తన టాలెంట్ తో ఎట్రాక్ట్ చేయడంతో ముందుకు ఆమెకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు.

గంగవ్వ ఎమోషనల్ స్టోరీ
గిఫ్ట్ ఇచ్చే ముందు గంగవ్వను ఒక విషయం అడుగగా ఆమె ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అప్పట్లో పొలం పని చేసే టప్పుడు పట్టీలు తీసి ఒక కుండలో దాచగా అవి ఎవరో తీసేశారు. అప్పుడు మా ఆయనే తాగుడుకు అలవాటు పడి అమ్ముకున్నట్లు చెప్పింది. అదే విషయాన్ని బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా వివరించింది.

అవ్వా.. నీకు నేనున్నాను
ఇక 20 ఏళ్లుగా పట్టిలు లేవని చెప్పడంతో గంగవ్వకు పట్టీలు కానుకగా ఇచ్చాడు మెహబూబ్. ఆ కానుకకు ఆశ్చర్యపోయిన గంగవ్వ ఎమోషనల్ అవ్వడంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న మెహబూబ్ అవ్వ నీకు నేనున్నాను ఏం కావాలన్నా నన్ను అడుగు అంటూ మెహబూబ్ వివరణ ఇచ్చాడు. ఇక మెహబూబ్, సుజాతకు స్వీట్స్ ను ప్రజెంట్ చేశాడు.