»   »  బుల్లితెర మెగా షో డేట్ ఫిక్స్, చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత?

బుల్లితెర మెగా షో డేట్ ఫిక్స్, చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి త్వరలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4వ సీజన్ ద్వారా బుల్లితెరపై మెగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ షో డిసెంబర్ నెలలోనే మొదలు కావాల్సి ఉంది. అయితే కారణాలేంటో తెలియదు కానీ మా టీవీ మేనేజ్మెంట్ ఈషోను వాయిదా వేస్తూ వచ్చారు.

తాజాగా ఈ షో మొదలు పెట్టడానికి డేట్ ఫిక్స్ చేసారు. ఫిబ్రవరి 13, 2017 రాత్రి 9.30 గంటలకు చిరంజీవి హోస్ట్ గా ప్రసారం అయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రసారం కానుంది. ఈ తొలి షోకు టీఆర్పీ రేటింగ్స్ ఏ రేంజిలో వస్తాయో అంటూ చర్చించుకుంటున్నారు.

 మెగా రేటింగ్స్ ఖాయం

మెగా రేటింగ్స్ ఖాయం

మెగాస్టార్ చిరంజీవితో హోస్ట్ చేస్తున్న షో కాబట్టి... గతంలో తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా భారీగా టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని భావిస్తున్నారు.

మెగాస్టార్ ఎంత తీసుకుంటున్నారు?

మెగాస్టార్ ఎంత తీసుకుంటున్నారు?

మీలో ఎవరు కోటీశ్వరుడు ఒక్కో ఎపిసోడ్‌కు పదిలక్షల రూపాయలు చిరంజీవికి రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఉన్న క్రేజ్ ఈ రెమ్యూరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. సౌత్ లో ఇప్పటి వరకు టీవీ షోలు సంబంధించి ఇదే హయ్యెస్ట్ అమౌంట్ అని టాక్.

 రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా

రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా

చిరంజీవి తనకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అసలు డిమాండ్ చేయలేదట. చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ 150వ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో కంటిన్యూ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే రెమ్యూనరేషన్ గురించి పట్టించుకోకుండా మీలో ఎవరు కోటీశ్వరుడు షో హోస్ట్ చేసేందుకు అంగీకరించారట.

 ఆ లక్కీ ఫ్యాన్ ఎవరో?

ఆ లక్కీ ఫ్యాన్ ఎవరో?

కాగా....మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో మెగాస్టార్ చేతుల మీదుగా చెక్ అందుకోబోయే మొదటి అదృష్ట వంతుడు ఎవరో... అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

English summary
Chiranjeevi will be making his small-screen debut with 'Meelo Evaru Koteeswarudu'. The first episode of 'Meelo Evaru Koteeswarudu' 4th Edition will be aired at 9.30 PM on February 13th, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu