'మొగలి రేకులు' ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగించేందుకు ఆ స్లాట్ లో అంటే జెమినీ టీవి ...రాత్రి 830 కు శ్రావణ సమీరాలు స్టార్ట్ చేస్తున్నారు. సోమవారం నుంచి అంటే 27.5.2013 నుంచి ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది. అయితే మొగలి రేకుల్లో ఉన్న ఆర్టిస్టులను ఇందులో తీసుకోకుండా జాగ్రత్తపడతారని తెలుస్తోంది.
ఇక 2008 పిభ్రవరి 18న ప్రారంభమైన మొగలి రేకులు సీరియల్ నడుస్తున్నంతకాలం రాష్ట్ర ప్రభుత్వ టీవి నంది అవార్డులతో పాటు అనేక సాంస్కృతిక సంస్ధల నుంచి అవార్డులు అందుకుంటూనే ఉంది. దానకి తోడు విపరీతమైన ప్రేక్షకాదరణతో నెంబర్ వన్ స్ధానాన్ని ఆక్రమించింది.
ఇక సోమవారం నుచంి ప్రారంభం అవుతున్న శ్రావణ సమీరాలు కూడా అదే సాంకేతిక బృందంతో మొదలవుతోంది. బిందునాయడు కథ అందించిన ఈ సీరియల్ కు మంజులానాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ పల్లమాల,శశాంక్ పల్లమాల నిర్మాతలుగా ఉంటారు. ఈ కొత్త సీరియల్ కు టైటిల్ సాంగ్ ని బంటి అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











