For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ కోసం మోనాల్ డేరింగ్ స్టెప్.. ఆమె కష్టానికి తగ్గట్లుగానే రెమ్యునరేషన్.. అంధరికంటే ఎక్కువే

  |

  హీరోయిన్ గా సక్సెల్ అవ్వాలి అంటే ఈ రోజుల్లో టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అదే విధంగా మంచి అవకాశాలు వచ్చే వరకు కాస్త ఓర్పుతో కూడా ఉండాలి. అయితే సూడిగాడు లాంటి బాక్సాఫీస్ హిట్ కొట్టినప్పటికి హీరోయిన్ మోనాల్ గజ్జర్ అనుకున్నంతగా క్రేజ్ అందుకోలేక పోయింది. అయితే బిగ్ బాస్ షోలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ అందింది. ఇక షో కోసం ఆమె తీసుకున్న డేరింగ్ స్టెప్ కారణంగా రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుతోంది. ఒక విధంగా అందరికంటే ఆమెకె ఎక్కువని టాక్.

  పాపులర్ సెలబ్రెటీ కాదని ట్రోలింగ్స్

  పాపులర్ సెలబ్రెటీ కాదని ట్రోలింగ్స్

  నిజానికి బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయినప్పుడు ఆడియెన్స్ కంటెస్టెంట్స్ విషయంలో కొంత నిరాశకు గురయ్యారని చాలా క్లియర్ గా అర్థమైంది. ఎవరు కూడా పెద్దగా పాపులర్ సెలబ్రెటీలు కాదని ట్రోలింగ్స్ కూడా గట్టిగానే వచ్చాయి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఊహించని టాస్క్ లను అలాగే హౌజ్ లో ఎప్పటికప్పుడు సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఆడియెన్స్ కూడా ప్రతిరోజూ ఎట్రాక్ట్ అయ్యే విధంగా చేశారు.

   ఒకవైపు అభిజిత్ మరోవైపు అఖిల్

  ఒకవైపు అభిజిత్ మరోవైపు అఖిల్

  అయితే మెయిన్ గా మోనాల్ ద్వారానే షోకి ఒక విధంగా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇద్దరి అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఉండడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఒకవైపు అభిజిత్ మరోవైపు అఖిల్ తో ఆమె వ్యవహరించే తీరు షోలో ఒక ప్రేమదేశం వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దానివల్ల అభిజిత్, అఖిల్ మధ్య గొడవలు పెరిగి తెలియకుండానే శత్రువులయ్యారు.

  పర్సనల్ లైఫ్ ని కూడా పట్టించుకోకుండా

  పర్సనల్ లైఫ్ ని కూడా పట్టించుకోకుండా

  ఒక టీవీ షోలో తన పర్సనల్ లైఫ్ ని కూడా పట్టించుకోకుండా మోనల్ నడుస్తున్న విధానం ఒక డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. అలాగే మరోవైపు ఆమె గ్లామర్ డోస్ కూడా రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. ఏ మాత్రం తగ్గకుండా యువకులను ఆకట్టుకునేలా ఆమె రోజుకో హాట్ లుక్ తో దర్శనమిస్తోంది. అందుకే ఈ బ్యూటీకి రెమ్యునరేషన్ స్ట్రాంగ్ గా అందుతున్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.

   మోనల్ రెమ్యునరేషన్ ఎంతంటే..

  మోనల్ రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక మోనాల్ ఒక వారానికి తీసుకునే రెమ్యునరేషన్ 8లక్షలకు తక్కువ ఉండదట. అంటే రోజుకు లక్షకు పైగానే అందుతోందని చెప్పవచ్చు. ఇప్పటికే షో మొదలై 30రోజులు దాటింది. చూస్తుంటే ఆమె ఇంకా మరో రెండు వారాలు కూడా కొనసాగే అవకాశం లేకపోలేదు. ఆ లెక్కన గమనిస్తే ఆమె ఆదాయం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

  వీరిలో ఎవరు వెళ్లిపోయినా.. ఎఫెక్ట్ తప్పదు

  వీరిలో ఎవరు వెళ్లిపోయినా.. ఎఫెక్ట్ తప్పదు

  అభిజిత్, అఖిల్, మోనాల్.. వీరిలో ఎవరు వెళ్లిపోయినా కూడా షోపై ఎంత కొంత ప్రభావం అయితే పడుతుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి జనాలు అమితంగా కనెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తుంటేనే అర్ధమవుతోంది. బిగ్ బాస్ లో ఇలాంటి ప్రేమ కథలు కామన్ అయినప్పటికీ మోనాల్ మాత్రం షోలో డోస్ ఎంత పెరిగినా బలంగా నిలబడుతోంది. అలాగే రోజుకో ట్విస్ట్ ఇస్తోంది. ఇక ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

  Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
  అందరికంటే ఆమెకే ఎక్కువ..

  అందరికంటే ఆమెకే ఎక్కువ..

  ఇక షోలో మొన్నటి వరకు లాస్య, నోయల్ కి అత్యధికంగా 7లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు టాక్ వచ్చింది. ఇక వారి తరువాత అభిజిత్, అఖిల్ కి 3లక్షల నుంచి 4లక్షల వరకు అందుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ వారికంటే ఎక్కువగా మోనాల్ చాలా కష్టపడుతోందని ఒక వైపు ట్రయాంగిల్ లవ్ స్టొరీ మరోవైపు గ్లామర్ ప్రజెంటేషన్ తో మంచి హైప్ క్రియేట్ చేస్తోందని వారానికి 8లక్షలు ఇస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

  English summary
  Despite hitting the box office like a sudigadu, the heroine Monal Ghajjar did not receive the craze as expected. However, when she entered the Bigg Boss show, she received a huge craze. Remuneration is also getting heavier due to the daring step she took for the longer show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X