Just In
- 3 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 4 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 4 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. నాగార్జున చిలిపి ప్రశ్నకు ఏం చెప్పిందంటే!
బిగ్‌బాస్ తెలుగు 4 షోలో 14వ వారాంతం సందడి సందడిగా ముగిసిపోయింది. సండే ఫన్ డే కావడంతో ఇంటి సభ్యుల్లో జోష్‌ను పుట్టించే గేమ్స్ ఆడించాడు హోస్ట్ నాగార్జున. ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించే సమయంలో మోనాల్‌తో నాగార్జున ఆసక్తికరమైన సంభాషణను కొనసాగించారు. వారి మధ్య సంభాషణ ఎలా సాగిందంటే..

నా పెళ్లి తర్వాత కష్టాలు పడొద్దని
బిగ్‌బాస్‌లో విజేతకు ఇచ్చే 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీపై హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులతో చర్చించారు. ఒకవేళ 50 లక్షలు వస్తే ఏం చేస్తారో చెప్పాలని సూచించాడు. ఈ సందర్భంగా మోనాల్ మాట్లాడుతూ.. తన తండ్రి మరణం తర్వాత మా బాధ్యతలన్నీ తల్లి చూసింది. ఆమె కష్టపడి మమ్మల్ని చదివించింది. 50 లక్షల ప్రైజ్ మని వస్తే నా తల్లికి ఇస్తాను. నా, నా సిస్టర్ పెళ్లి తర్వాత నా తల్లి ఎలాంటి కష్టాలు పడొద్దనే తన కోరిక అంటూ మోనాల్ చెప్పింది.

నాగార్జున జోక్యం చేసుకొంటూ..
మోనాల్ తన పెళ్లి గురించి ప్రస్తావించడంపై హోస్ట్ నాగార్జున జోక్యం చేసుకొంటూ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు.. పెళ్లి గురించి నాకు మాట్లాడేందుకు లీడ్ ఇచ్చావు. ఇంతకు పెళ్లి ఎప్పుడు అని అడగడంతో మోనాల్ సిగ్గుపడిపోయింది. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకొని ముసి ముసిగా నవ్వింది.

నాగార్జున చిలిపి ప్రశ్నకు
నాకు నీ పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదు. కానీ నీవే పెళ్లి పెళ్లి అంటున్నావు కాబట్టి ఆ విషయం గురించి అడగాల్సి వచ్చింది అంటూ నాగార్జున చిలిపిగా సమాధానం ఇచ్చాడు. దాంతో ఇంటి సభ్యులందరూ కూడా నవ్వుల్లో మునిగిపోయారు. నీవు లీడ్ ఇచ్చావు కాబట్టే ఎప్పుడు అని అడిగాను అంటూ నాగార్జున అనడంతో మోనాల్ మళ్లీ నవ్వుల్లో మునిగిపోయింది.

పెళ్లి అనేది ఇప్పుడు చర్చ కాదు.
పెళ్లి అనేది ఇప్పుడు చర్చ కాదు. పెళ్లి తర్వాత నా తల్లి నా మీద డిపెండ్ కాకుండా ఉండాలన్నదే నా అభిప్రాయం. పెళ్లి తర్వాత నేను ఇంటికి వెళ్తే నాకు ఎదైనా ఇచ్చేలా ఆమెను ఆర్థికంగా స్థిరంగా ఉంచాలనేది ప్లాన్. అయితే కేవలం 50 లక్షలు ఏం చేయాలన్నదే ఆలోచన. పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్స్ లేవు అంటూ నాగ్‌కు మోనాల్ గజ్జర్ వెల్లడించింది.