ఛీ కొట్టిన అవినాష్.. గట్టిగా ముద్దు పెట్టిన మోనాల్.. క్లారిటీ వచ్చిందటూ అఖిల్
బిగ్‌బాస్ ఇంటిలో 8వ వారానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులు చాలా ఎమోషనల్‌గా కనిపించారు. ఎవరి గ్రూపులు వారు కూర్చొని నామినేషన్లపై పిచ్చాపాటిగా చర్చించుకొంటూ కనిపించారు. ఈ క్రమంలో అవినాష్, అరియానా మధ్య ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. మోనాల్ వచ్చి అవినాష్‌కు గట్టిగా.. ప్రేమతో ముద్దు ఇవ్వడంతో సీన్ మారిపోయింది. మోనాల్ గురించి అవినాష్ చేసిన కామెంట్స్ ఏమిటంటే..

అవినాష్ నుదుటిపై ముద్దు
అరియానాతో అవినాష్ మాట్లాడుతున్న సమయంలో మోనాల్ వచ్చి అఖిల్‌తో కూర్చొన్నది. దాంతో నా వద్దకు వస్తానని చెప్పి అఖిల్‌తో కూర్చుంటావా? ఛీ ఛీ మాట మార్చావు. ఐ హేట్ యూ. నీవు మైండ్ సెట్ మార్చుకొంటావని అనుకోలేదు అంటూ మోనాల్‌ను ఉద్దేశించి అవినాష్ అంటే.. లేదు.. లేదు.. వచ్చే వారం అంటూ మోనాల్ వివరణ ఇస్తూ పరుగు పరుగున అవినాష్ నుదుటిపై ముద్దుపెట్టింది. ఆ తర్వాత అరియానాను కౌగిలించుకొన్నది.

కమెడియన్‌కు హీరోయిన్ ముద్దు అంటూ
మోనాల్ ముద్దు పెట్టి వెంటనే అఖిల్ వద్దకు వెళ్లిపోతుండగా.. అవినాష్ లేచి గట్టిగా అరుస్తూ.. బిగ్‌బాస్ నాకు అరియానా ముద్దు పెట్టింది. నా నుదుటిపై ముద్దుపెట్టిందోయ్ అంటూ కేకలు పెట్టాడు. ఒక కమెడియన్‌కు హీరోయిన్ ముద్దు పెట్టింది. అరియానా మనసులో ఉన్న A అక్షరం అంటే అవినాష్ అనే విషయం అర్ధమైంది అంటూ అవినాష్ కేకలు పెట్టి హంగామా చేశాడు.

మోనాల్ మనసులో నేనే అంటూ
మోనాల్ మనసులో ఉన్న హీరో ఈ కమెడియనే. అసలు మోనాల్ దృష్టిలో, మనుసులో ఉన్నది నేనే అంటూ అవినాష్ గట్టిగా అరించాడు. దాంతో అఖిల్ స్పందిస్తూ.. ఇన్ని రోజులకు మోనాల్ విషయంలో క్లారిటీ లభించింది. థ్యాంక్యూ సో.. మచ్.. ఇన్ని రోజలుక నాకు క్లారిటీ ఇచ్చినందుకు అని అన్నారు.

అవినాష్ నాకు కొంచెం టైమ్ కావాలి
మోనాల్ మనసులో అవినాష్ ఉంటే.. నాతో ఎందుకు టైంపాస్ చేస్తూ కూర్చొన్నది అని అఖిల్ అంటే.. నేనే వెళ్లమని పర్మిషన్ ఇచ్చాను అని అవినాష్ అన్నాడు. ఆ ఇద్దరి మాటల్లో మోనాల్ దూరుతూ.. అవినాష్ కొంచెం టైమ్ కావాలి అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో సంతోషంలో మునిగి తేలుతూ.. నా పొలంలో మొలకలు వచ్చాయి అంటూ నువ్వొస్తానంటే వద్దంటానా సినిమాలో డైలాగ్ కొడుతూ అవినాష్ డ్యాన్స్ చేస్తుండటం ఫన్‌గా మారింది.


Click it and Unblock the Notifications











