Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అప్పుడు శ్రీముఖి.. ఇప్పుడు మోనాల్.. ఆ అవకాశంతో లక్ కలిసి వచ్చేనా?
బిగ్ బాస్ కంటెస్టెంట్లకు స్టార్ మా కొన్ని వరాలు ఇస్తుంటుంది. షోలకు రావడానికి ముందే కొన్ని ఒప్పందాలు చేసుకుంటుంది. బిగ్ బాస్ షో అనంతరం మరేతర అవకాశాలైన కల్పిస్తామన నిబంధన ఉంటుందేమో. అందుకే బిగ్ బాస్ షో అయ్యాక కొంత మంది కంటెస్టెంట్లకు స్టార్ మా మంచి అవకాశాలనే ఇచ్చింది. కానీ అవి ఎవ్వరికీ ఉపయోగపడలేదు. తాజాగా మోనాల్‌కి కూడా స్టార్ మా ఓ ఆఫర్ ఇచ్చింది.

గతంలో అలా..
రెండో సీజన్ బిగ్ బాస్ షో ముగిసిన తరువాత తేజస్వీకి స్టార్ మా ఓ ఆఫర్ ఇచ్చింది. బ్రహ్మానందంతో కలిసి స్టార్ మా స్డాండప్ కామెడీ అంటూ తేజస్వీ రచ్చ చేసింది. కానీ ఆ షో డిజాస్టర్‌గా మిగిలింది. అందులో తేజస్వీ మీదున్న నెగెటివి కూడా ఓ కారణమని అప్పట్లో టాక్ వచ్చింది. ఇక శ్రీముఖికి సైతం మూడో సీజన్ తరువాత స్టార్డ్ మ్యూజిక్ అంటూ ఓ షోను ఇచ్చారు. అది కూడా ఫ్లాపుగానే మిగిలింది.

ఇప్పుడు మోనాల్ వంతు..
బిగ్ బాస్ నాల్గో సీజన్ దాదాపుగా మోనాల్ చుట్టే తిరిగింది. అభిజిత్ అఖిల్ మోనాల్ అంటూ నాల్గో సీజన్ బాగానే నడిచింది. అయితే మోనాల్ టాపిక్ లేకుండా, ఆమె గురించి గొడవలో, ఆమె చేసే గొడవలే లేకుండా ఎపిసోడ్ మాత్రం జరగలేదు. మోనాల్ మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉన్నా కూడా ఆమె ఎలిమినేట్ అవుతుందని ఎన్ని సార్లు అనుకున్నా కూడా బిగ్ బాస్ సేవ్ చేస్తూనే వచ్చాడు. తాజాగా మంచి ఆఫర్ కూడా ఇప్పించినట్టున్నాడు.

ముందే ఒప్పందం
అయితే మోనాల్‌తో ఈ మేరకు ముందే ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ తరువాత ఏదో ఒక షోలో చాన్స్ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె అలా బయటకు వచ్చిందో లేదో ఇలా ఓ షోలో జడ్జ్ గానో హోస్ట్ గానో చాన్స్ వచ్చేసిందని అందరూ అనుకుంటున్నారు.

ఓంకార్ షోలో..
డ్యాన్స్ ప్లస్ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఓంకార్ గ్రాండ్‌గా డిజైన్ చేసినట్టున్నాడు. ఇప్పటికే ప్రోమోల మీద ప్రోమోలు వదిలాడు. తాజాగా ఇందులో మోనాల్ కూడా కనిపిస్తోంది. అయితే ఇందులో మోనాల్ జడ్జ్‌గా వ్యవహరిస్తుందా? లేదా హోస్ట్‌గా చేస్తుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. డ్యాన్స్ ప్లస్ షోకు ఇంకా ఒక్కరోజే ఉందంటూ తన దైన శైలిలో మోనాల్ చెప్పడం ఆకట్టుకుంటోంది. మరి ఈ షోతో మోనాల్ మళ్లీ మిగతా ఆఫర్లను దక్కించుకుంటుందా? లేదా అన్నది చూడాలి.