Just In
- 32 min ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 1 hr ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 2 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 3 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ కంటెస్టెంట్లపై మోనాల్ గజ్జర్ షాకింగ్ కామెంట్స్: అభిజీత్‌ను ఉద్దేశించే అలా మాట్లాడిందంటూ!
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అప్పుడెప్పుడో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం ద్వారా విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బిగ్ బాస్‌లోని కొందరు కంటెస్టెంట్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

వాళ్లిద్దరితో లవ్ ట్రాక్.. ఫుల్ పాపులర్
ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. మొదటి రోజు నుంచే అందరితో మంచిగా మెలుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే అభిజీత్‌కు బాగా దగ్గరైంది. కొన్నాళ్ల పాటు అతడితో ట్రావెల్ చేసిన తర్వాత.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌తో క్లోజ్ అయింది. ఒకేసారి ఇద్దరితో ట్రాక్స్ నడుపుతున్నట్లు చూపించడంతో ట్రైయాంగిల్ లవ్‌గా హైలైట్ అయింది.

అతడితో ఘాటు రొమాన్స్.. హాట్ టాపిక్
షో నడుస్తోన్న కొద్దీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో A ఉన్నాడని చెప్పేసింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అలాగే, అతడిని నామినేషన్స్ నుంచీ కాపాడింది. ఆ సమయంలోనే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

అప్పటి వరకూ వచ్చినా.. చివర్లో అవుట్
ఎన్నో సార్లు డేంజర్ జోన్‌లో ఉన్నా సేఫ్ అవుతూ వచ్చింది మోనాల్ గజ్జర్. దీంతో మంచి మంచి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్‌పై విమర్శలు కూడా చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు ఆమె ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందీ గుజరాతీ భామ.

వరుస ఆఫర్లు.. షోతో పాటు స్పెషల్ సాంగ్
బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌తో మోనాల్ గజ్జర్ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ప్రారంభం అయింది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆ కంటెస్టెంట్లపై మోనాల్ షాకింగ్ కామెంట్స్
వరుస ఆఫర్లతో హాట్ టాపిక్ అవుతోంది మోనాల్ గజ్జర్. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా అఖిల్ సార్థక్‌తో కలిసి ఓ ఈవెంట్‌కు వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ప్రముఖ న్యూస్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తమ బంధం గురించి మాట్లాడుతూ.. ‘మేము హౌస్‌లో విడివిగా ఆడాము. అయినా రియల్ ఫ్రెండ్‌షిప్‌తో కలిసున్నాం' అని చెప్పింది. అలాగే, కొందరిపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

జంటగా అలా చేశారంటూ బాంబ్ పేల్చింది
బిగ్ బాస్ గేమ్ గురించి మాట్లాడుతూ.. ‘హౌస్‌లో చాలా మంది కంటెస్టెంట్లు జంటగా, గ్రూపులుగా ఆడారు. వాళ్లంతా చివరి వరకూ అలాగే ఉన్నారు. మేము మాత్రం గేమ్ గేమ్‌లానే ఆడాం. అదే సమయంలో రిలేషన్‌ను కూడా కొనసాగించాం' అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోనాల్ చేసిన కామెంట్లు అభిజీత్ అండ్ కోను ఉద్దేశించి చేసినవే అన్న టాక్ బాగా వినిపిస్తోంది.