Just In
- 5 min ago
పవన్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్: ఆమె కారణంగానే ‘వకీల్ సాబ్’ హిట్.. మైనస్ అనుకున్నదే ప్లస్ అయింది
- 36 min ago
యాక్టర్ హేమ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ.. ఆ పార్టీలో చేరి జోరుగా ప్రచారం
- 41 min ago
పబ్లిక్‌లో పచ్చిగా ప్రవర్తించిన బిగ్ బాస్ భామ: అక్కడ ముద్దులు.. పాడు పనులు చేస్తూ అలా బుక్కైంది
- 57 min ago
మలైకా అరోరా చేతికి నిశ్చితార్థం ఉంగరం.. పెళ్లికి ముందు అసలు గుట్టు అదే..
Don't Miss!
- News
వైఎస్ షర్మిల నిరాహార దీక్షకు హైదరాబాద్ పోలీసులు షాక్: కొన్ని గంటల ముందు..!
- Sports
IPL 2021: జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ.. స్టార్ పేసర్‌కు కరోనా!
- Automobiles
టాటా నెక్సాన్ ఈవీలో ఆ రెండు వేరియంట్లకే భలే డిమాండ్; చార్జింగ్ స్టేషన్ల పెంపుకు ప్లాన్స్!
- Lifestyle
వేసవిలో పుచ్చకాయ రసం తాగితే శరీరానికి ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా?
- Finance
చైనా, పాక్ సహా పోల్చినా.. మూడు వారాల్లో రూపాయి భారీ పతనం, ఎందుకంటే?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘నాకు నీకు’ అంటూ అవినాష్ డబుల్ మీనింగ్ డైలాగ్: అది కొంచెం దించరా అంటూ అటు చూపించిన యాంకర్ వర్షిణి!
దాదాపు ఐదేళ్లుగా తెలుగు బుల్లితెరపై స్టార్ కమెడియన్‌గా వెలుగొందుతున్నాడు ముక్కు అవినాష్. మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన అతడు.. జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా పాపులర్ అయ్యాడు. తనదైన శైలి పంచులతో నవ్వించే అతడు.. బిగ్ బాస్‌లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక, ఈ షో తర్వాత మరింత బిజీగా మారిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తాజాగా ఓ షోలో 'నాకు నీకు' అంటూ ముక్కు అవినాష్ ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు. దీనికి యాంకర్ వర్షిణి 'కొంచెం దించరా' అంటూ అటు చూపిస్తూ ఘాటుగా స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

అలా ఆరంభమైన కెరీర్.. ఇలా పాపులారిటీ
మిమిక్రీ ఆర్టిస్టుగా బిజీగా గడుపుతోన్న సమయంలోనే మంచి గుర్తింపును అందుకున్నాడు ముక్కు అవినాష్. ఆ సమయంలోనే జబర్ధస్త్ షో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. అలా ఎంటరైన అతడు ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చిందీ జబర్ధస్త్ యూనిట్. దీంతో టాప్ కమెడియన్ అయిపోయాడు.

ఆ షోకు గుడ్‌బై... రియాలిటీ షోలోకి ప్రవేశం
జబర్ధస్త్ షోతో ఎనలేని క్రేజ్‌ను అందుకుని సినిమా ఛాన్స్‌లు కూడా దక్కించుకున్నాడు అవినాష్. ఈ క్రమంలోనే అతడికి బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది వచ్చిన నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వాలని అతడిని కోరారు. దీంతో రెండో వారంలో జోకర్ గెటప్‌తో అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చ రచ్చ చేసేశాడు.

బిగ్ బాస్ షాక్... ఎంటర్‌టైనర్‌గా పేరొచ్చింది
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే అవినాష్‌ను టైటిల్ ఫేవరెట్ అనుకున్నారంతా. అందుకు అనుగుణంగానే చాలా రోజుల పాటు టాప్‌లో ఉన్నాడు. కానీ, ఆ తర్వాత కొన్ని గొడవలు, వివాదాల కారణంగా అతడిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఓటింగ్ కూడా తగ్గిపోయింది. ఫలితంగా షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ, ఎంటర్‌టైనర్‌గా పేరును మాత్రం సంపాదించుకున్నాడు.

వాళ్లందరితో కలిసి కామెడీ... స్టార్స్‌గా సిద్ధం
బిగ్ బాస్ షో తర్వాత అవినాష్ వరుస షోలలో ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రారంభమైన ‘కామెడీ స్టార్స్' అనే షో చేస్తున్నాడు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌తో పాటు చమ్మక్ చంద్ర తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

‘నాకు నీకు' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్
‘కామెడీ స్టార్స్' ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. దీంతో టీమ్ మొత్తం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుంది. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో అవినాష్ లేడీ గెటప్ వేసుకుని కబడ్డీ ఆడాడు. ఆ సమయంలో అతడు ఓ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పి యాంకర్ వర్షిణికి షాకిచ్చాడు.

అది కొంచెం దించరా అంటూ అటు చూపిస్తూ
ఈ గేమ్‌లో భాగంగా వర్షిణి.. ‘నీ కూత ఏంటిరా' అని అవినాష్‌ను ప్రశ్నించగా.. ‘నీది నీకే నాది నాకే' అంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఇక, కబడ్డీ కోసం లేడీ గెటప్ వేసిన అవినాష్ చీరను లేపి పట్టుకునే నిల్చున్నాడు. దీంతో వర్షిణి ‘అది దించరా బాబు' అంటూ అతడి కింద వైపునకు చూసింది. దీంతో ఈ వీడియో ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.