Just In
- 1 hr ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 1 hr ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 3 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 3 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
Don't Miss!
- News
Prabhas: బాహుబలి బిస్కేట్ రూ. 10 వేలు, స్కెచ్ అదిరింది, విదేశాల్లో షూటింగ్, చివరికి చాట మిగిలింది!
- Sports
పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే సగం మీసం తీసేస్తా: అశ్విన్
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పులిహోర చేయడం ఎలా.. వాటికి కావాల్సిన వస్తువులు ఏమిటంటే.. అఖిల్‌కు అవినాష్ పంచ్!
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4 సీజన్‌కు ఒక రోజు ముందు ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులు హౌస్‌ను సందర్శించారు. ఆ నేపథ్యంలో ముక్కు అవినాష్ ఇంట్లోకి వెళ్లి సందడి చేశాడు. కొన్ని పాటలకు డ్యాన్స్ చేసిన అనంతరం ఇంటి సభ్యులతో మాట్లాడాడు. వారికి ధైర్యం చెబుతూ..

అఖిల్‌పై అవినాష్ పంచులు
అఖిల్‌ను అవినాష్ ఉద్దేశించి పంచ్‌లు వదిలాడు. నిన్ను చూస్తుంటే నైట్ వచ్చే బిగ్‌బాస్ షో మాదిరిగా లేదు. మధ్యాహ్నం వచ్చే వంటల ప్రొగ్రాం మాదిరిగా ఉంది. బాగా కలుపుతున్నావు. పులిహోర చేయడంలో నీకు మించిన వాడు ఉండడు అంటూ అవినాష్ అనగానే.. ఏయ్ ఆపు అంటూ అఖిల్ అడ్డుకొన్నాడు.

పులిహోర చేయడానికి కావాల్సినవి
పులిహోర చేయడానికి కావాల్సింది అఖిల్. ఇంకా ఎంత మంది అమ్మాయిలు ఉంటే పులిహోరకు చేయడానికి మంచిది. పులిహోరకు కావాల్సిన వస్తువులు అంటూ అఖిల్‌పై సెటైర్లు వేశాడు. పులిహోర కలపడం ఆపకపోతే యూసఫ్ గూడ, కృష్ణనగర్‌ను కలిపిస్తావు అంటూ కామెంట్ చేశాడు.

మోనాల్ ఇంట్లోకి వచ్చిందా?
ఇంటిలోకి మోనాల్ వచ్చిందా అని అడిగితే.. పొద్దునే వచ్చింది అంటూ అఖిల్ సమాధానం ఇచ్చాడు. అయితే కలిపివేశావా పులిహోర అంటూ మజాక్ చేశాడు. దాంతో ఇదంతా జోక్ అని చెప్పు అవినాష్ అంటూ అఖిల్ రిక్వెస్ట్ చేశాడు. అయితే అవును నేను సీరియస్‌గా అబద్దం చెబుతాను అని అవినాష్ పంచ్ విసిరాడు.

నాకు ప్రపోజ్ చేశాడంటూ.. అరియానా
అఖిల్‌తో అవినాష్ మాట్లాడుతుంటే.. అవును నీవు లేవని నాకు ప్రపోజ్ చేశాడు. నాకు అన్నం తినిపించాడు అని అరియానా తెలిపింది. అవును నేను లేని చూసి నా బెడ్ వద్దకు వెళ్లి కలిపిన పులిహోర కలిపిందుకు ప్రయత్నించావు అంటూ అవినాష్ సెటైర్ వేశాడు.

మీరందరూ సెలబ్రిటీలే...
నేను 13వ వారాలు మాత్రమే ఇంటిలో ఉంటే నాకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. మీరు 15 వారాలు ఇంట్లో ఉన్న మీకు బయట క్రేజ్ మామూలుగా లేదు. సోహెల్ నీవు మాత్రమే కాదు.. ఇంటిలో అందరూ సెలబ్రిటీలుగా మారారు అంటూ అవినాష్ చెప్పేసి.. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.