»   » బిగ్ బాస్: ముమైత్ రివేంజ్ ఫెయిల్, ప్రేక్షకుల ఓటింగుతో వేటు!

బిగ్ బాస్: ముమైత్ రివేంజ్ ఫెయిల్, ప్రేక్షకుల ఓటింగుతో వేటు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షోలో మరో ఎలిమినేషన్ ఘట్టం ముగిసింది. ఆదివారం(ఎపిసోడ్ 50) జరిగిన ఎన్టీఆర్ హోస్ట్ షోలో ముమైత్‌ను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపించేశారు. ముమైత్ ఇంటి నుండి బయటకు రావడం ఇది రెండో సారి. అయితే ఈ సారి ఆమెకు మళ్లీ ఇంట్లోకి ప్రేవేశించే అవకాశం మాత్రం లేదు.

గతంలోనే ఓ సారి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా... బిగ్ బాస్ తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి షోను మరింత ఎంటర్టెనింగ్‌గా కొనసాగించేందుకు ఆమెను ఇంట్లోకి పంపించారు. అయితే ముమైత్ తిరిగి ఇంట్లోకి వెళ్లడం చాలా మంది తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు.

ఓటింగ్‌తో ముమైత్‌ను మీద వేటు

ఓటింగ్‌తో ముమైత్‌ను మీద వేటు

ఈ వారం ఇంట్లో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూదను అనే అంశానికి సంబంధించి తెలుగు ప్రేక్షకులు ఏకంగా 2 కోట్లు ఓట్లు వేశారు. ఇందులో ముమైత్‌కు చాలా తక్కువ ఓట్లు రావడంతో ఆమెను బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు పంపారు.

Bigg Boss Telugu : Mumaith Khan Is Eliminated From Bigg Boss Telugu Episode 50
కెప్టెన్ అయినప్పటికీ ఎలిమినేట్

కెప్టెన్ అయినప్పటికీ ఎలిమినేట్

ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉండే వారికి ఎలిమినేషన్ నుండి రక్షణ ఉండేది. అయితే ముమైత్‌కు చాలా తక్కువ ఓట్లు రావడంతో ఆమె కెప్టెన్ అయినప్పటికీ ఎలిమినేట్ చేశారు. కెప్టెన్ గా ఉన్న ఆమె బయకు వెళ్లారు కాబట్టి....ముమైత్ తీసిన చీటీల ద్వారా నవదీప్, దీక్ష‌లను కెప్టెన్సీ కి పోటీ పడటం కోసం ఎంపిక చేశారు. సోమవారం జరిగే టాస్క్‌లో వీరిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ అవుతారు.

ఇంటి సభ్యులు గెస్ చేసిందే నిజమైంది

ఇంటి సభ్యులు గెస్ చేసిందే నిజమైంది

బిగ్ బాస్ ఇంటి నుండి ఈ వారం ముమైత్, దీక్ష, అర్చనలో ఎవరు బయటకు వెళతారు అనే విషయమై.... జస్ట్ గెస్సింగ్ కోసం ఇంటి సభ్యులతో చీటీలు రాయించారు. అందులో కూడా చాలా మంది ముమైత్ పేరే రాయడం గమనార్హం.

బాధ లేదు, హ్యాపీగా సాగనంపారు

బాధ లేదు, హ్యాపీగా సాగనంపారు

గతంలో ఇంటి నుండి ఎవరైనా సభ్యులు ఎలిమినేట్ అయి బయటకు వెలుతుంటే.... అందరూ చాలా బాధ పడుతూ సాగనంపేవారు. అయితే ఈ సారి ముమైత్ వెలుతుంటే ఎవరిలోనూ పెద్దగా బాధ కనిపించలేదు. హ్యాపీగా ఆమెను సాగనంపారు.

రివేంజ్ ధోరణితో వెళ్లాను కానీ..

రివేంజ్ ధోరణితో వెళ్లాను కానీ..

నేను ఇంట్లోకి రెండోసారి చాలా రివేంజ్ ధోరణితో వెళ్లాను కానీ... ఇంట్లో అందరూ చాలా డిప్లమాటిక్‌గా ప్రవర్తించడం మొదలు పెట్టారని, అందుకే ఈ గేమ్ లో నేను సక్సెస్ కాలేక పోయానేమో అని ముమైత్ అభిప్రాయ పడ్డారు.

హరితేజ మీద బిగ్ బాంబ్

హరితేజ మీద బిగ్ బాంబ్

వెలుతూ వెలుతూ ముమైత్ తనకు దక్కిన బిగ్ బాంబ్ అవకాశాన్ని హరితేజప మీద వేసింది. దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో రూల్స్ బ్రేక్ అయినప్పుడల్లా, బిగ్ బాస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడల్లా పరుగుత్తుకుంటూ వెళ్లి ఆమె స్విమ్మింగ్ ఫూల్ లో దూకాలి. ఈ బాంబ్ వేసిన కొంతసేపటికే అర్చన అనుకోకుండా ఇంగ్లీషులో మాట్లాడి రూల్స్ బ్రేక్ చేయడంతో హరితేజ స్విమ్మింగ్ ఫూల్ లో దూకాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ సెల్ఫీ

ఎన్టీఆర్ సెల్ఫీ

బిగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ శాశ్వతంగా వెలుతున్న సందర్భంగా ఎన్టీఆర్ ఆమెతో కలిసి ఓ సెల్పీ దిగారు.

English summary
Mumaith Khan Is Eliminated From Bigg Boss Telugu Episode 50. The elimination declared by audience voting system.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu