»   » బిగ్‌బాస్‌లో మరో వికెట్.. ముమైత్ రనౌట్!.. ఇప్పటికే సంపూ సెల్ఫవుట్..

బిగ్‌బాస్‌లో మరో వికెట్.. ముమైత్ రనౌట్!.. ఇప్పటికే సంపూ సెల్ఫవుట్..

Written By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో డ్రగ్ కేసును ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరు బిగ్‌బాస్ రియాలిటీ షో నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ తప్పదని భావిస్తున్నారు. ఎందుకంటే టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్ వ్యవహారంలో ముమైత్ ఆరోపణలు ఎదుర్కోవడమే. సిట్ విచారణ వేగవంతమయి తొలి దఫా ముగింపుకు వచ్చిన నేపథ్యంలో ముమైత్‌ను విచారించకపోతే దర్యాప్తుపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడానికి అవకాశాలుండేవి. ఈ వారంలో రవితేజ, ముమైత్‌ను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు ఈ ముంబై భామపై అందరి దృష్టిపడింది.

బిగ్‌బాస్ పంజరంలో దూరిన ముమైత్

బిగ్‌బాస్ పంజరంలో దూరిన ముమైత్

డ్రగ్ కేసు బయటకు రావడానికి ముందే ముమైత్ ఎంచక్కా బిగ్‌బాస్ పంజరంలో దూరింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి పోలీసులు ఇస్తే షో రచ్చ రచ్చ అవుతుంది. నోటీసు ఇవ్వకపోతే అధికారులకు మెడకు చుట్టుకునే అవకాశాలు మెండుగా ఉండేవి. టోటల్‌గా ముమైత్ వ్యవహారం నిర్వాహకులకు అడకత్తెరలో పోకచెక్కగా మారిన నేపథ్యంలో బిగ్‌బాస్ నుంచి తప్పక బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారంలో రవితేజ, ముమైత్‌ను విచారించాల్సి ఉన్న నేపథ్యంలో సిట్ అధికారులు ఈ ముంబై భామపై అందరి దృష్టిపడింది.

Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
ముమైత్‌తో గాడి తప్పున బిగ్ బాస్ షో..

ముమైత్‌తో గాడి తప్పున బిగ్ బాస్ షో..

డ్రగ్ కేసు పక్కన పెడితే వాస్తవానికి బిగ్‌బాస్ నుంచి మొట్టమొదటిగా బయటకు పంపాల్సిన సెలబ్రిటీలో ముమైత్ ఖాన్ ఫస్ట్ అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే బిగ్‌బాస్ షో నియమాల ప్రకారం సెలబ్రిటీలు తప్పనిసరిగా తెలుగు మాట్లాడాల్సిందే. అయితే ముమైత్ కారణంగా తెలుగులో మాట్లాడగలిగే వారు కూడా ఆమెకు కోసం ఇతర భాషల్లో మాట్లాడాల్సి వస్తున్నది. ముమైత్ కారణంగా ఈ రియాలిటీ షో వెనుక ఉన్న అసలు ఉద్దేశం గాడితప్పినట్లయింది.

కిచిడి రియాలిటీ షో

కిచిడి రియాలిటీ షో

ముమైత్ కారణంగా బిగ్‌బాస్ రియాలిటీ షో తెలుగు వెర్షన్ కాకుండా పలు భాషల కిచిడిగా కార్యక్రమంగా మారింది. అసలు ఇది ఏ లాంగ్వేజ్ కార్యక్రమంలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమాన్ని అచ్చ తెలుగు షో కాకుండా హైబ్రిడ్‌ షోగా మార్చడంలో ముమైత్ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో డ్రగ్ కేసు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

బిగ్‌బాస్‌కు డ్రగ్స్ బెదురు..

బిగ్‌బాస్‌కు డ్రగ్స్ బెదురు..

ముమైత్‌ను ముందుగానే తప్పిస్తే డ్రగ్స్ కేసు కారణంగానే బయటకు పంపించారనే అపవాదును మూటగట్టుకోవాల్సి వచ్చేది. అందుకోసమే పాపం జ్యోతిని అకారణంగా బయటకు నెట్టారు. అది తెలిసే బిగ్‌బాస్‌లో అనేక ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకొనే అవకాశం ఉంటాయి. కావున మీరు మళ్లీ పిలుపును అందుకొనే అవకాశం ఉంటుందనే హింట్‌ను కూడా నిర్వాహకులు హెస్ట్ ఎన్టీఆర్ చెప్పించారు.

సంపూ నస తట్టుకోలేక..

సంపూ నస తట్టుకోలేక..

ఇక బిగ్‌బాస్‌లో సంపూ నస తట్టుకోలేక ఆయనను సాగనంపారు. కానీ ఎలిమినేట్ చేసినట్టు ఎక్కడ చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. అంటే సంపూ ఇంకా అధికారికంగా ఇంటి నుంచి బయటకు రాలేదని విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. బిగ్‌బాస్ షో స్క్రిప్ట్ ప్రకారం కాకుండా బయట జరుగుతున్న ఈవెంట్ల ప్రభావం వల్ల ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయనేది ప్రేక్షకులకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్తున్నాయి.

ఉత్త పుణ్యానికి రెండు వికెట్లు

ఉత్త పుణ్యానికి రెండు వికెట్లు

బిగ్‌బాస్ స్క్రిప్ట్ ప్రకారం జరుగాల్సిన ఎలిమినేషన్ ప్రక్రియ ఆధారంగా కాకుండా ఉత్తుత్తిగానే రెండు వికెట్లు పడ్డాయి. అందులో జ్యోతి, సంపూ వికెట్లు ఊహించని ట్విస్టులే. జ్యోతీ ఎలిమినేషన్‌లో బలమైన కారణాలు కనిపించలేదు. ఇంటి నియమాలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నందన ముమైత్ ఎగ్జిట్‌ తప్పదని భావించినప్పటికీ ధానిని నిర్వాహకులు చాలా చాకచక్యంగా ముందుకు జరిపారనే చెప్పవచ్చు. ఏది ఏమైనా ముమైత్ వ్యవహారం బిగ్‌బాస్‌కు పెంటగా మారింది.

తెలుగు సీరియళ్ల కంటే నాసిరకంగా..

తెలుగు సీరియళ్ల కంటే నాసిరకంగా..

బిగ్ బాస్‌ ఇంటిలో కలహాలు తెలుగు సీరియల్‌ను కూడా మించలేకపోతున్నాయి. తెలుగు సీరియళ్లు చూసి గుండెను నిబ్బరంగా చేసుకొన్న ప్రేక్షకులకు బిగ్‌బాస్ సెలబ్రిటీల మధ్య జరిగే గొడవలు చాలా నాసిరకంగా కనిపిస్తున్నాయి. ఇలానే ఈ షో కొనసాగితే వారాంతంలో ఎన్టీఆర్ మెరుపులు తప్పా మరేమీ కనిపించేటట్టు లేవు.

English summary
Telugu Version of Bigboss started with High Energy. But it is going so so affair. Already Sampoo gone out on Tuesday and Mumaith is ready for elemination. There are unnecessory, Unexpected things are happening in the reality show.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu