»   » టీవీ నటికి వేధింపులు: చేజ్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు

టీవీ నటికి వేధింపులు: చేజ్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు

By Pratap
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Mumbai: TV actress Alefia Kapadia harassed by motorist
  ముంబై: ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ మోటారిస్టు టీవీ నటి కారును వెంబడిస్తూ ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆమె కారుకు అతి సమీపంగా వెళ్లి అనరాని మాటలు అన్నాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమె కారుకు గీతలు పెట్టాడు. ఆమె కారుకు అడ్డంగా వచ్చాడు. ఆమె కారు తలుపులు తెరవడానికి కూడా ప్రయత్నించాడు. ఈ మేరకు మిడ్డేలో వార్తాకథనం ప్రచురితమైంది.

  మిడ్డే వార్తాకథనం ప్రకారం - టీవీ సీరియల్ ద్వారా ప్రజాదరణ పొందిన అలెఫియా కపాడియా (28) ముంబైలోని సాహు నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది.

  బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి బైకుల్లాలోని తన నివాసానికి అలెఫియా వెళ్తుండగా ధరవి ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. ఆమె వెళ్తున్న సమయంలో ధరవి ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఆమె వెంట ఆమె నాలుగేళ్ల కూతురు కూడా కారులో ఉంది.

  ఆమె కారుకు మోటరిస్టు అతి సమీపంగా వచ్చి, ఫేస్‌బుక్ ఉందా, తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగలవా అని ప్రశ్నించసాగాడు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో తాను మాట్లాడదలుచుకున్నట్లు చెప్పాడు. అతన్ని భయపెట్టడానికి ఆమె అతని ఫొటో తీసింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే ఉద్దేశంతో మరింత దురుసుగా ప్రవర్తించాడు.

  English summary
  A television actress's drive back home along a congested stretch of the city on Saturday evening was interrupted by a disturbing encounter with a fellow motorist, who drove up close to her car, passed inappropriate remarks, and when met with resistance, scratched her car, blocked her path, and even tried to open the door to the vehicle, before driving away.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more