Just In
Don't Miss!
- News
చాలా కాలం తర్వాత పార్టీ కార్యక్రమంలో భాగస్వామ్యం..!సోమవారం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించనున్న బాబు.!
- Sports
టీమిండియాను విమర్శించిన స్టార్క్ సతీమణి.. మతిభ్రమించిందంటూ మండిపడ్డ ఫ్యాన్స్!
- Finance
6 కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.13 లక్షల కోట్లు జంప్: టీసీఎస్, ఎయిర్టెల్ అదుర్స్
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జబర్ధస్త్‌లోకి నాగబాబు రీఎంట్రీ: ఈ వార్తలో నిజమెంత.? మెగా బ్రదర్ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.!
పేరుకు మెగాస్టార్ చిరంజీవి సోదరుడే అయినప్పటికీ... తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. అదే సమయంలో నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. వీటన్నింటి వల్ల రాని గుర్తింపును బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సంపాదించుకున్నారు. అది కూడా ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారానే. ఇటీవలే ఈ షో నుంచి బయటకు వెళ్లిన ఆయన.. ఇందులోకి రీఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఆ వివరాలు మీకోసం.!

నవ్వుల రారాజును చేసిన కామెడీ షో
తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత పాపులారిటీని సంపాదించుకున్ షోలలో ‘జబర్ధస్త్' ఒకటి. స్టాండప్ కామెడీ షోగా పరిచయం అయిన దీనికి తక్కువ కాలంలోనే క్రేజ్ వచ్చింది. ఈ షోకు మొదటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ షో ఆయనను నవ్వుల రారాజును చేసింది. దీని వల్ల నాగబాబుకు మంచి గుర్తింపు కూడా దక్కింది.

ఏడేళ్ల బంధానికి బ్రేక్ ఇచ్చిన మెగా బ్రదర్
దాదాపు ఏడేళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన నాగబాబు.. ఇటీవల దీని నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పట్లో ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. వ్యక్తిగత కారణాలతోనే ఆయన గుడ్‌బై చెప్పినప్పటికీ.. ఈ వ్యవహారంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి.

వరుస వీడియోలతో షాకిచ్చిన నాగబాబు
జబర్ధస్త్ షో నుంచి తప్పుకోవడం వెనుక బలమైన కారణాలు ఏమీ లేవని మొదట చెప్పుకొచ్చారు మెగా బ్రదర్ నాగేంద్రబాబు. కానీ, ఆ తర్వాత ఆయన వరుసగా విడుదల చేసిన వీడియోలలో పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. జబర్ధస్త్ యూనిట్ తమతో అగౌరవంగా ప్రవర్తించేదని, చాలా మంది ఆర్టిస్టులకు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేదని చెబుతూ బాంబు పేల్చారాయన.

అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చిన టవర్ స్టార్
సుదీర్ఘ ప్రయాణం అనంతరం జబర్ధస్త్‌కు వీడ్కోలు పలికిన టవర్ స్టార్ నాగబాబు.. కొద్ది రోజుల గ్యాప్ అనంతరం మరో ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అదిరింది' అనే కామెడీ షోలో కనిపించి ఆశ్చర్య పరిచారు. ఆయన వెంటే జబర్ధస్త్ టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే, పాత జబర్ధస్త్ మెంబర్లు వేణు, ధన్‌రాజ్ కూడా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు.

జబర్ధస్త్ కామెడీ షోలోకి నాగబాబు రీఎంట్రీ
జబర్ధస్త్‌కు పోటీగా ప్రారంభించిన ‘అదిరింది'కి ప్రేక్షకుల నుంచి స్పందన రావడం లేదని, ఈ కారణంతో మెగా బ్రదర్ నాగబాబు ఆ షోకు కూడా దూరం కాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మల్లెమాల ప్రొడక్షన్ ఆయనకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.


మెగా బ్రదర్ వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది.!
నాగబాబు జబర్ధస్త్ షోలోకి రీఎంట్రీ ఇస్తున్నారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... నాగబాబు అదిరింది షోలోనే కంటిన్యూ అవుతున్నారట. ఆయనపై వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ చూపు అదిరింది షోపైనే పడుతోంది.