Just In
- 25 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 31 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 51 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 56 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్‌కు షాక్: రిలయన్స్‌కు గుడ్‌న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్‌లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగబాబుకు షాకిస్తున్న జబర్దస్త్ టీమ్.. స్కెచ్ అదిరింది.. తట్టుకోలేకపోతున్న మెగా బ్రదర్!
నవ్వుల నవాబుగా ఏడేళ్ల పాటు జబర్దస్త్ కామెడీ పండించారు నాగబాబు. కంటిస్టెంట్లు చేసే కామెడీ ఎంత నవ్వించిందో, అంతకుమించి తన నవ్వులతో బుల్లితెర ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్నారు ఈ మెగా బ్రదర్. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవలే జబర్దస్త్ వీడి 'అదిరింది' అంటున్న నాగబాబుకు షాకిస్తోంది మల్లెమాల టీమ్. ఆ వివరాలేంటో చూద్దామా..

నాగబాబు వెళ్లారు.. ఆ తర్వాత వారానికే
జబర్ధస్త్ షో చూసే ఆడియన్స్‌లో ఎక్కువ మంది.. జబర్ధస్త్ జడ్జ్‌లుగా ఉండే నాగబాబు, రోజా నవ్వులకే అట్రాక్ట్ అయ్యేవారని, ఇప్పుడు ఈ జోడీ విడిపోయింది కాబట్టి ఇక జబర్దస్త్ తెర మసకబారే అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ నాగబాబు వెళ్లిన వారానికే వచ్చిన టీఆర్ఫీ రిపోర్ట్స్ అందరికీ షాకిచ్చాయి.

జబర్దస్తీ పోటీ.. యుద్ధ వాతావరణం
మరోవైపు నాగబాబు.. వేరొక ఛానెల్‌లో ప్రసారమవుతున్న 'అదిరింది' షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ షో ప్రారంభమైంది. చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ఇందులోకి షిఫ్ట్ అయ్యారు. ఈ షో కాన్సెప్ట్ కూడా జబర్దస్త్ కాన్సెప్టే కావడంతో ఈ రెండు షోల మధ్య పోటీ తీవ్రతరమై యుద్ధ వాతావరణం నెలకొంది.

జబర్దస్త్ షోతో అదిరింది పోలిక.. హాట్ ఇష్యూ
జబర్దస్త్, అదిరింది షోల మధ్య పోలికలు, నాగబాబు పరిస్థితి గురించి విశ్లేషణలు మొదలయ్యాయి బుల్లితెర ప్రేక్షకుల్లో. ఈ మేరకు టీఆర్ఫీ రేటింగ్స్ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ జబర్దస్త్ షోతో అదిరిందిని పోలుస్తున్నారు. సేమ్ టూ సేమ్ ఫార్మాట్ కావడం పైగా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన టీం లీడర్స్ అదిరిందిలో స్కిట్స్ వేస్తుండటం ఈ పోలికలకు ప్రధాన కారణమైంది.

నాగబాబు వెళ్ళాడు.. సరే! మొదట ఎలా ఉన్నా..
నాగబాబు వెళ్ళాడు కాబట్టి ఎన్నో అంచనాల నడుమ ప్రారంభమైంది అదిరింది షో. కానీ ఆశించిన రేటింగ్ రాబట్టకపోవడం అందరికీ షాకిస్తోంది. సరే! మొదట ఎలా ఉన్నా మెల్లగా పుంజుకుంటుందని ఆశించారు నిర్వాహకులు. బట్ అలాంటిదేం జరగడం లేదని తెలుస్తోంది. అదిరింది షో కేవలం 3.5 రేటింగ్ మాత్రమే నమోదు చేయడం దీనికి ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు.

నాగబాబు సక్సెస్ కానట్లే!
మరోవైపు జబర్దస్త్ మాత్రం అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. నాగబాబు వెళ్ళాక కూడా కనీసం 9 టీఆర్ఫీ మెయింటేన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ రిపోర్ట్స్ చూసిన జనం.. జబర్దస్త్ వీడిన నాగబాబు అనుకున్న మేర సక్సెస్ కానట్లే అని చెప్పుకుంటున్నారు. జబర్దస్త్ బాగబాబుగానే తమకు ఆయన కిక్కిచ్చారని అంటున్నారు.

జబర్దస్త్ స్కెచ్ అదిరింది
ఇదిలా ఉంటే జీ తెలుగులో నాగబాబు అదిరింది షో ప్రసారమయ్యే సమయానికి జబర్దస్త్ టీమ్ కూడా రంగంలోకి దిగడం మరో ఆసక్తికర అంశంగా మారింది. సరిగ్గా అదిరింది షో ప్రసారమయ్యే సమయంలో ఈటీవీ తెరపై జబర్దస్త్ పాత స్కిట్స్ కొంచెం ఎడిట్ చేసి ప్రసారం చేస్తున్నారు. దీంతో వీటికే డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. అంటే ఈ రకంగా జబర్దస్త్ స్కెచ్ అదిరింది అని చెప్పుకోవచ్చు కదూ!.