నాకు ఇద్దరు కూతుళ్లు.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్..

Nagarjuna: టాలీవుడ్ సీనియర్ సూపర్‌స్టార్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడుతూ నటిస్తున్నారు. ఇక ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ లో మన్మథుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. తాజాగా కింగ్ నాగార్జున ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున తన సినీ కెరీర్, ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ కు సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

40 ఏళ్ల సినీ కెరీర్
టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల్లో కింగ్ నాగార్జున ఒక్కరు. కింగ్ కెరీర్ లో శివ, క్రిమినల్, మనం, సంతోషం, నిన్నే పెళ్లడతా, మాస్, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయన వంటి ఎన్నో హిట్స్‌ ప్రత్యేక గుర్తింపు పొందారు. కింగ్ తన 40 ఏళ్ల సినిమా కెరీర్ లో కేవలం కమర్షియల్‌ సినిమాలకే పరిమితం కాలేదు. అన్నమయ్య, రామదాస్ వంటి డివోషనల్ సినిమాతో సరికొత్త ప్రయోగాలు చేశారు. ఎన్నో వైవిధ్య పాత్రలకు జీవం పోశారు కింగ్‌ నాగార్జున.

Nagarjuna Opens Up About His Bond With Daughter-in-Law Sobhita Dhulipala

ఇండస్ట్రీలో మార్పులు
తాజాగా అక్కినేని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఇప్పటివరకు ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ, వాటికి తగ్గట్టుగా మారుతున్నాను. గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు పాపులారిటీ ప్రతీ రోజురోజుకు మారుతుంది'అని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో మార్పులపై నాగార్జున మాట్లాడుతూ 'క్యాసెట్‌ల నుండి DVDs,పెన్ డ్రైవ్, ఇప్పుడు ఫోన్లలో సినిమాలు చూడటం వరకు మార్పులు వచ్చాయి. నేను 'ఓల్డ్ స్కూల్'కాదు. కాలంతో పాటు నేను కూడా మారుతున్నా. ప్రస్తుత ప్రపంచంలో పోటీ పడుతూ ముందుకు వెళ్లాలి'అని పేర్కొన్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల వారసత్వం:
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ స్టూడియోను నాగార్జున తన వారసులు నాగ చైతన్య, అఖిల్ లతో కలసి నడిపుతున్నారు. ఈ స్టూడియో గురించి మాట్లాడుతూ.. మొదటి 30 ఏండ్లు చాలా కష్టంగా గడిచాయి. మా నాన్న, మేము సినిమాల ద్వారా చాలా పొందాం, అందుకే సినీ పరిశ్రమకు ఇస్తున్నాం. నా వారసులు కూడా ఈ బాటలోనే ముందుకు సాగుతున్నారు " అని పేర్కొన్నారు.

కుటుంబ బంధాలు
నాగార్జున తన కొడుకులతో ఎలా ఉంటారో చెప్పారు. "మేము ఫ్రెండ్స్, కానీ గౌరవం కూడా ఉంది. ఉదాహరణకి నేను రూమ్ లోకి వచ్చినప్పుడు వారు లేచి నిలబడటం, గ్రీటింగ్ చెప్పుకోవడం. వర్క్‌ అవుట్ కూడా కలిసి చేస్తాం, కానీ, మా మధ్య కాంపిటీషన్ లేదు"అని పేర్కొన్నారు. అలాగే.. నాగ చైతన్య భార్య శోభిత గురించి మాట్లాడుతూ "శోభిత నిజంగా ఫాంటాస్టిక్. మేము బుక్స్, మ్యూజిక్ గురించి చర్చిస్తాము. ప్రస్తుతం శోభిత నాగ చైతన్య ఇంట్లో ఒక గార్డెన్ పెంచాలని అనుకుంటోంది. నాకు కూడా గార్డెనింగ్‌ పై ఆసక్తి. కాబట్టి ఆ అంశం గురించి కూడా చర్చిస్తాం. ఇంట్లో ఒక కూతురు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు - జైనాబ్ (అఖిల్ భార్య), శోభిత" అని నాగార్జున తెలిపారు.

వర్క్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్:
నాగార్జున లెటెస్ట్ గా రజినీకాంత్‌తో 'కూలీ' సినిమాలో నటించారు. మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.517 కోట్ల వసూళ్లతో ఫైనాన్షియల్ సక్సెస్ సాధించారు. ప్రస్తుతం కింగ్ నాగ్ డైరెక్టర్ రా కార్తీక్‌తో కలిసి 'కింగ్ 100'అనే యాక్షన్-ఫ్యామిలీ డ్రామా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. మొత్తానికి కింగ్ నాగార్జున తాజా ఇంటర్వ్యూ ద్వారా తన కుటుంబం, వ్యక్తిగత జీవితం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై స్పష్టత ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X