»   » నాగార్జునపై మగాళ్ల మంట, ఆడోళ్ల ఆశీర్వాదాలు!(ఫోటోలు)

నాగార్జునపై మగాళ్ల మంట, ఆడోళ్ల ఆశీర్వాదాలు!(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి తమకు ఇష్టమైన కార్యక్రమాలు టీవీల్లో చూసి రిలాక్స్ అవుదామనే మగరాయుళ్లకు.....మహిళా మణుల సీరియల్స్ పిచ్చి చిర్రెత్తిస్తున్న సంగతి తెలిసిందే. హీరో నాగార్జున లాంటి వారు కూడా సాగదీత సీరియల్స్ నిర్మిస్తుండటంపై మగాళ్లు మంటెక్కి పోతున్నారు. అయితే మహిళలు మాత్రం ఆయన నిర్మించే సీరియల్స్ ఎంతో బాగున్నాయంటూ....మరిన్ని ఇలాంటి సీరియల్స్ తీయాలని ఆశీర్వదిస్తున్నారు.

తాను నిర్మిస్తున్న 'పుట్టింటి పట్టుచీర', 'పసుపు కుంకుమ', 'శశిరేఖా పరిణయం' లాంటి సిరీయల్స్‌కు ప్రచారం కల్పించడంలో భాగంగా నాగార్జున ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సీరియల్స్‌ను ఆదరించాల్సిందిగా బెల్లితెర ప్రేక్షకులను కోరారు.

నాగార్జున ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టీవీ సీరియల్ తారలు పల్లవి, యామిని తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

బిజినెస్‌మేన్ నాగార్జున

బిజినెస్‌మేన్ నాగార్జున


హీరో నాగార్జున సక్సెస్ ఫుల్ నటుడు మాత్రమే కాదు...సక్సెఫుల్ బిజినెస్ మేన్ కూడా. తన తండ్రి స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థను లాభాల బాటలో నడిపించడానికి ఎన్ని మార్గాలుంటే అన్నింటిలోనూ తలదూరుస్తున్నాడు నాగార్జున. తన తెలివితేటలతో కాసుల పంట పండిస్తున్నాడు.

పెట్టుబడులే పెట్టుబడులు

పెట్టుబడులే పెట్టుబడులు


ఇప్పటికే నాగార్జున సినిమా నిర్మాణ రంగం, సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో అడుగు పెట్టాడు. అన్నపూర్ణ స్టూడియోస్ తరుపున సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. టీవీ సీరియల్స్ కూడా నిర్మిస్తున్నాడు. మాటీవీలో కూడా నాగార్జునకు వాటాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఆ రంగాల్లో కూడా...

ఆ రంగాల్లో కూడా...


ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ధోనీతో కలిసి ఇంటర్నేషనల్ బైకు రేసింగు ప్రాంచైజీల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు, ఇండియన్ బ్యాట్మింటన్ లీగ్‌లో వాటులు కొనుగోలు చేసాడు నాగార్జున.

అనేక వ్యాపారాలు

అనేక వ్యాపారాలు


ఇవే కాకుండా నాగార్జునకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఆయన నిర్మించిన ‘ఉయ్యాలా జంపాలా' చిత్రం ఇటీవల విడుదలై పెట్టుండికి పదింతల లాభాలు తెచ్చిపెట్టింది.

English summary
Annapurna Studios TV Serials Press Meet held at Hyderabad. Actor Nagarjuna, Actress Yamini, Pallavi and others graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu