»   » నాగార్జున హావభావాల షో... చూసారా(ఫొటోఫీచర్)

నాగార్జున హావభావాల షో... చూసారా(ఫొటోఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున తొలిసారిగా హోస్ట్ చేస్తున్న టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. హిందీలో అమితాబచ్చన్ యాంకర్‌గా చేస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి స్ఫూర్తితో ఈ షోను డిజైన్ చేశారు. వారానికి నాలుగు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) రాత్రి 9 గంటల నుంచి 10.30 గంటల మధ్య మాటీవీ ఛానెల్‌లో ఈ షో ప్రసారం అవుతోంది. ఈ షోకు అద్భుతమైన స్పందన వచ్చిందని టీవీ యాజమాన్యం చెప్తోంది.

ఇప్పటివరకూ ఏ షోకు రాని రెస్పాన్స్ టీఆర్పీల రూపంలో వచ్చిందని చెప్తున్నారు. నాన్ ఫిక్షన్ కేటగిరిలో నాలుగవ స్ధానంలో ఈ షో ఉందని అంటున్నారు. ఈ షోలో పాల్గొనేందుకు కంటెస్టెంట్స్‌ను ఎంపికచేసేందుకు ఏప్రిల్ 24 నుంచి గతనెల 1 మధ్యలో అడిగిన 7 ప్రశ్నలకు ప్రేక్షకుల నుంచి 10 లక్షల ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయని మాటీవీ తెలిపింది. ఇందులోంచి 1500 మందిని ఎంపికచేసినట్లు ఛానెల్ వెల్లడించింది.

ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈ అండ్ వై) పర్యవేక్షణలో ఎంట్రీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత దశగా 1500 మంది నుంచి 100 పోటీదారులను ఎన్నుకున్నట్లు మాటీవీ తెలిపింది. ఈ షోలో నాగార్జున అడిగే 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా కంటెస్టెట్ కోటి రూపాయలు గెలుచుకోవచ్చు.

స్లైడ్ షో లో ..నాగార్జున...

ఇదీ విధానం

ఇదీ విధానం

మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'లో పాల్గొనే అవకాశం అందరికీ ఉంది. హాట్ సీన్ చేరుకొని తమ అభిమాన హీరో నాగార్జునతో ఆడాలనుకున్నవారు మాటీవీలో ప్రసారమవుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పంపి రిజిష్టర్ చేసుకోవాలి. ఇచ్చిన ఏడు ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సమాధానం ఎస్‌ఎంఎస్ చేసినా హాట్ చేరుకొనే అవకాశం దక్కవచ్చు. అంతేకాదు జీవితాన్ని మార్చేసే కోటి రూపాయల బహుమతిని కూడా అందుకోవచ్చు.

పర్యవేక్షణలో..

పర్యవేక్షణలో..

మాటీవీ ఈ పోటీని అత్యంత విశ్వసనీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తోంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో ఈ షో సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. బిగ్ సినర్జీ ఈ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. కోటి రూపాయల బహుమానం అందించే ఈ షోలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది.

ఐడియా ఫ్రమ్

ఐడియా ఫ్రమ్

కోటి రూపాయలు గెలుచుకోవాలన్న కలని ఎవరైనా నిజం చేసుకోవచ్చునే ఆలోచనతో ఆరంభమైంది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ షోని మాటీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకులకు అందింస్తోంది.

నాలెడ్జ్ షో

నాలెడ్జ్ షో

2014 జూన్ నుంచి షెడ్యూల్ ప్రారంభమయిన ఈ నాలెడ్జ్ షో అత్యంత ఆసక్తికరంగా సాగుతూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు విలక్షణమైన వినూత్నమైన వినోదాన్ని అందించబోతోంది. జీవితం సంధించే వంద ప్రశ్నలకు ఒకటే జవాబు- అదే, మీలో ఎవరు కోటీశ్వరుడు.

రెమ్యునేషన్

రెమ్యునేషన్

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ద్వారా....నాగార్జున మంచి ఫ్యాన్సీ ఎమౌంట్ ని రెమ్యునేషన్ గా వసూలు చేస్తున్నట్లు చెప్తున్నారు. మాటీవిలో తనకు షేర్స్ ఉన్నా రెమ్యునేషన్ విషయంలో రాజీ పడలేదని తెలుస్తోంది. నలభై ఎపిసోడ్స్ కి గానూ మూడు కోట్లు వరకూ తీసుకుంటున్నారని టీవి వర్గాల సమాచారం.

నాగార్జున హైలెట్

నాగార్జున హైలెట్

నాగార్జున హావభావాలు, షో ను నడిపించే తీరే ...ఈ షోకు హైలెట్ అని ఒప్పుకోవాలి. నాగార్జున చాలా హుందాగా, చాలా సరదాగా, ఒక్కోసారి ఎమోషన్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

English summary
According to data compiled by TAM, Nagarjuna Anchored Meelo Evaru Koteeswarudu recorded an all time high of 9.7 tvr in female 15+ and maintained an average of 6.7 TVR in cs 4+. The No 1 show so far in Telugu Television is pushed to 6th position in the opening week of this game show, which has contributed 110 GRPs this week for MAA TV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X