»   » కారు అద్దాలు బద్దలుకొట్టి తప్పించుకున్న నటుడు: రియల్ హీరో

కారు అద్దాలు బద్దలుకొట్టి తప్పించుకున్న నటుడు: రియల్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల్లో కారు ప్రమాదాలు జరిగినపుడు, లేదా కారు మంటల్లో చిక్కుకున్నపుడు హీరో వీరోచితంగా అద్దాలు బద్దలు కొట్టి తప్పించుకోడం, ఎవరినైనా కాపాడటం చేస్తుంటారు. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటివి చేయాలంటే రియల్ హీరో అయి ఉండాలి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

Namish Taneja escapes unhurt as his car catches fire

స్వరాగిణి, ఏక్ నయీ పెహ్‌చాన్ వంటి సీరియల్స్‌లో హీరోగా నటించిన హిందీ సీరియల్ నటుడు నమీష్ తనేజా కారు పెట్రోల్ లీకేజ్ కావడంతో మంటల్లో కాలిపోయింది. అయితే పెట్రోల్ లీకైన విషయం ముందుగానే గమనించిన నమిష్ కారులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే పొరపాటున సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఆన్ అవడంతో విండోస్ ఓపెన్ కాలేదు.

దీంతో కారులో చిక్కుకుపోయిన నమీష్ వీరోచితంగా అద్దాలను బద్దలుకొట్టి బయట పడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రమాదం గురించిన విషయం వెల్లడించిన నమీస్ ఇది తనకు పునర్జన్మేనని చెప్పుకొచ్చారు.

Read more about: tv టీవీ
English summary
Swaragini actor Namish Taneja escapes unhurt as his car catches fire.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu