»   » తెలుగు బిగ్‌ బాస్ 2: ఎన్టీఆర్ స్థానంలో నాని ఖరారైనట్లే...

తెలుగు బిగ్‌ బాస్ 2: ఎన్టీఆర్ స్థానంలో నాని ఖరారైనట్లే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nani To Host For BIgg Boss 2

నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్‌ను హోస్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఆయన షో నిర్వాహకుల నుండి ఇప్పటికే భారీ పారితోషికంతో కూడిన అడ్వాన్స్ చెక్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నాని తెలుగు బిగ్ బాస్ 2 ప్రోమో విడుదల చేయబోతున్నారని టాక్.

 మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాల్టీ షో

మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాల్టీ షో

తొలి సీజన్ హోస్ట్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన రెండో సీజన్ హోస్ట్ చేయలేని స్థితిలో ఉండటంతో ఆ స్థానాన్ని నానితో రీప్లేస్ చేయాలని ప్లాన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. గతేడాది జులై 16న బిగ్ బాస్ తొలి సీజన్ ప్రారంభం అయింది. సెప్టెంబర్ 24న గ్రాండ్ ఫినాలెతో ముగిసింది. ఈ షో తెలుగులో భారీ టీఆర్పీ రేటింగులతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ రియాల్టీ షోగా నిలిచింది.

ఎన్టీఆర్ బిజీ బిజీ

ఎన్టీఆర్ బిజీ బిజీ

ప్రస్తుతం ఎన్టీఆర్... త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్టుకు కమిట్ అయ్యారు. ఈ సినిమాలతో బిజీగా ఉండే ఆయన ‘బిగ్ బాస్ 2' రెండో సీజన్ హోస్టింగ్ అవకాశాన్ని వదులుకోకతప్పలేదు.

 నాని ది బెస్ట్

నాని ది బెస్ట్

‘బిగ్ బాస్ 2' హెూస్ట్ చేయడాని బెస్ట్ ఆప్షన్‌గా నాని అనే నిర్ణయానికి వచ్చి నిర్వాహకులు అతడిని సంప్రదించడం, పలు చర్చల అనంతరం నాని కూడా చేయడానికి ఓకే చెప్పడం జరిగిపోయిందట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

రెమ్యూనరేషన్ ఎంత?

రెమ్యూనరేషన్ ఎంత?

మొదటి సీజన్లో ఎన్టీఆర్ ఒక్కో సీజన్‌కు రూ. 35 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాక్. హీరో నానికి కూడా ఇందుకు ఏ మాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ ఇవ్వాలని బిగ్ బాస్ 2 నిర్వాహకులు డిసైడ్ అయినట్లు సమాచారం.

 టాలెంట్, స్టార్ ఇమేజ్

టాలెంట్, స్టార్ ఇమేజ్

నేచురల్ యాక్టింగ్‌తో పాటు మంచి కామెడీ టైమింగ్, మాటలతో కట్టపడేయగల టాలెంట్ నాని సొంతం. పైగా వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్నాడు. నాని టాలెంట్, అతడి స్టార్ ఇమేజ్ బిగ్ బాస్ 2 కార్యక్రమానికి మరింత వన్నె తెస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

English summary
Natural star Nani is set to replace Junior NTR as a host on Star Maa's hit reality TV show Bigg Boss Telugu 2. The actor has reportedly received a fat pay-check for hosting the second season.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X