For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యంగ్ యాంకర్‌పై నిహారిక సంచలన వ్యాఖ్యలు: కసికందు అంటూ స్టేజ్ మీదే దారుణంగా!

  |

  నిహారిక కొణిదెల.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై, ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. నిజానికి మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా బ్యాగ్రౌండ్‌తో సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంది. కెరీర్ పరంగా ఎదుగుతోన్న సమయంలో మెగా డాటర్ వివాహం జరిగిపోయింది. అయినప్పటికీ కెరీర్‌ను మాత్రం ఆపలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిహారిక ఓ షోలో పాల్గొంది. ఇందులో యంగ్ యాంకర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అలా పరిచయం.. ఇలా పాపులర్

  అలా పరిచయం.. ఇలా పాపులర్

  నిహారిక ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన 'ఢీ' అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా చేస్తూ పరిచయం అయింది. అక్కడ తనదైన హోస్టింగ్‌తో మెప్పించిన ఈ అమ్మాయి.. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో నటించింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది.

  నిధి అగర్వాల్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌లో ఆమెనిలా చూశారంటే!

  పెళ్లి తర్వాత కూడా కెరీర్ స్పీడ్

  పెళ్లి తర్వాత కూడా కెరీర్ స్పీడ్

  హీరోయిన్‌గా రాణించాలని అనుకున్న నిహారికకు వరుస పరాజయాలు ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా తన కెరీర్‌ను కంటిన్యూ చేస్తోంది. అయితే, ఇప్పుడామె హీరోయిన్‌గా నటించకున్నా.. తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్నింటిని కంప్లీట్ చేసుకుంది.

  హలో వరల్డ్ అంటూ వెబ్ సిరీస్

  హలో వరల్డ్ అంటూ వెబ్ సిరీస్

  నిహారిక తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ప్రస్తుతం 'హలో వరల్డ్' అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో ఆర్యన్ రాజేష్, నిత్యా శెట్టి, నిఖిల్, అనిల్ గీలా తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శివ సాయి వర్థన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ5 సంస్థ ఈ సిరీస్‌కు నిర్మాణ భాగస్వామిగా ఉంది. దీన్ని అందులోనే త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

  దేత్తడి హారిక అందాల ఆరబోత: బాడీ పార్టులన్నీ కనిపించేలా ఘోరంగా!

  సుమ క్యాష్ షోలోకి వచ్చిన టీమ్

  సుమ క్యాష్ షోలోకి వచ్చిన టీమ్

  సుమ కెరీర్‌లోనే బెస్ట్ షోగా పేరు తెచ్చుకున్న 'క్యాష్' వారం వారం మరింత సందడి చేస్తూ అలరిస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కోసం 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌ టీమ్ సభ్యులు నిహారిక, నిఖిల్, నిత్యా శెట్టి, అనిల్ గీలాలు సందడి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లతో సుమ తెగ సందడి చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు.

  వాళ్లకు చుక్కలు చూపించింది

  వాళ్లకు చుక్కలు చూపించింది

  'క్యాష్' షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కోసం వచ్చిన 'హలో వరల్డ్' టీమ్ సభ్యులకు యాంకర్ సుమ చుక్కలు చూపించింది. మరీ ముఖ్యంగా యంగ్ యాంకర్ నిఖిల్, మై విలేజ్ షో అనిల్‌లను ఆమె ఓ ఆట ఆడుకుంది. సుమతో పాటు నిహారిక కూడా వాళ్లకు అదిరిపోయే పంచ్‌లు వేసింది. ఫలితంగా ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫన్నీగా సాగినట్లు కనిపిస్తోంది.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  నిఖిల్‌కు ఎవరో ఇష్టమంటా అని

  'క్యాష్' షోలో భాగంగా యాంకర్ సుమ.. నిఖిల్ మదర్‌గా నటించింది. అప్పుడు నిహారిక వచ్చి 'ఆంటీ.. నిఖిల్‌కు ఎవరో ఇష్టమంటా' అంటుంది. దీనికామె 'ఊరుకో అమ్మా వాడు చిన్నపిల్లోడు' అని బదులిస్తుంది. అప్పుడు నిహారిక 'సుమ మీ మమ్మీ క్యారెక్టర్‌ను కాపీ చేసేసిందిరా' అంటూ కామెంట్ చేసింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ పగలబడి మరి నవ్వేశారు.

  నిఖిల్‌ పరువు తీసేసిన నిహారిక

  నిఖిల్‌ పరువు తీసేసిన నిహారిక


  నిహారిక తన గురించి చెప్పిన తర్వాత నిఖిల్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడతను 'అమ్మా.. నేను ఏమీ ఎరగని పసికందును' అంటూ కామెంట్ చేశాడు. దీనికి వెంటనే నిహారిక 'నువ్వు పసికందు కాదురా.. కసికందు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో నిఖిల్ నోరు మూసుకుని షాకయ్యాడు. మిగిలిన వాళ్లూ అవాక్కయ్యారు. దీంతో ఈ ప్రోమో తెగ వైరల్ అయిపోతోంది.

  English summary
  Niharika Konidela, Nikhil, Nithya Shetty and Anil Geela Participated in Anchor Suma Cash Show Upcoming Episode. Mega Daughter Shocks Young Anchor in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X