»   » ఇండస్ట్రీలో డేటింగ్ విచ్చలవిడితనం: కొత్త రూల్, సంతకం చేస్తేనే అవకాశం..

ఇండస్ట్రీలో డేటింగ్ విచ్చలవిడితనం: కొత్త రూల్, సంతకం చేస్తేనే అవకాశం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ టీవీ నటి, 'బాలికా వధు' సీరియల్ (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)లో లీడ్ రోల్ చేసిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈమె ఆత్మహత్య నేషనల్ లెవల్ లో హాట్ టాపిక్ అయింది. బాయ్ ఫ్రెండుతో డేటింగ్, మనస్పర్థలు తదితర కారణాలతో ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడింది. బాయ్ ఫ్రెండు కారణంగా ఆమె గర్భం దాల్చడం, అబార్షన్ చేయించుకోవడం లాంటివి కూడా జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి.

మరి ఈ సంఘటన ఎఫెక్టో..? ఏమో? తెలియదు కానీ హిందీ టీవీ ఇండస్ట్రీలో ఓ కొత్తరూల్ తీసుకొచ్చారు నిర్మాతలు. టీవీ సీరియల్ అగ్రిమెంటులో 'నో డేటింగ్' క్లాజ్ చేర్చారు. అంటే షూటింగ్ పూర్తయ్యే వరకు తాము ఎవరితోనూ డేటింగ్ చేయబోమని, సింగిల్ గానీ ఉంటామని హామీ ఇస్తూ నటీనటులు ఇందులో సంతకం చేయాలన్నమాట.

రిష్టన్ కా సౌదాగర్-బాజీగర్ అనే టీవీ సీరియల్ కోసం అందులో లీడ్ రోల్ చేస్తున్న వత్సల్ సేథ్, ఇషితా దత్తా 'నో డేటింగ్' క్లాజ్ తో కూడిన ఒప్పంద పత్రం మీద సంతం కూడా చేసారు. త్వరలో ఈ సీరియల్ ప్రారంభం కానుంది.

అయితే ఈ క్లాజ్ మీద కొందరు విమర్శలు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిగత విషయాలనీ, ఇలాంటి రూల్ పెట్టడం స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని కొందరు నటీనటులు మండి పడుతున్నారు.

విచ్చలవిడితనం

విచ్చలవిడితనం

ఈ మధ్య సినీ, టీవీ పరిశ్రమల్లో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయింది. నటీనటులు పెళ్లికి ముందే కలిసి ఉండటం, డేటింగ్ చేయడం, గర్భం దాల్చడం లాంటివి జరుగుతున్నాయి. అందుకు ప్రత్యూష బెనర్జీ ఉదంతమే నిదర్శనం

వత్సల్ సేథ్, ఇషితా దత్తా

వత్సల్ సేథ్, ఇషితా దత్తా

డేటింగ్, ప్రేమ వ్యవహారాలు వల్ల ఏర్పడే వ్యక్తిగత సమస్యల వల్ల నటీనటులు షూటింగులకు డుమ్మా కొట్టడం, ఆత్మహత్యలు చేసుకోవడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడం లాంటివి జరుగుతున్నాయి.

పూనమ్ ప్రీత్

పూనమ్ ప్రీత్

అందుకే ఈ కొత్త రూల్ తీసకొచ్చామని, షూటింగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఇలా చేస్తున్నామని అంటున్నారు.

రషమి దేశాయ్

రషమి దేశాయ్

ఇలాంటి వ్యక్తిగత విషయాలనీ, ఇలాంటి రూల్ పెట్టడం స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని కొందరు నటీనటులు మండి పడుతున్నారు.

English summary
Actors Vatsal Seth and Ishita Dutta signed a no-dating policy recently for their show Rishton Ka Saudagar – Baazigar, which seemed to have created quite a stir in the industry. While some actors feel that this is a necessary step, others feel that it’s an invasion of privacy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu