twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోయల్‌ సీన్‌ను వేధిస్తున్న వ్యాధి ఇదే.. దాని వల్ల ఎలాంటి సమస్యలంటే?

    |

    బిగ్‌బాస్‌ తెలుగు షోలో చక్కగా ఆడుతున్న నోయల్ సీన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అయితే వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఎపిసోడ్‌లో ఆయన బయటకు వెళ్లారు. అయితే ఆయనను వేధిస్తున్న వ్యాధికి తప్పనిసరి చికిత్స అవసరం కావడంతో అర్ధాంతరంగా నోయల్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన వ్యాధి గురించి నోయల్ చెబితే..

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాధితో

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాధితో

    హెస్ట్ నాగార్జునతో నోయల్ సీన్ మాట్లాడుతూ... నేను యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాను. బిగ్‌బాస్‌లోకి వచ్చినప్పుడు కుడికాలులో ఆ వ్యాధి లక్షణాలు డెవలప్‌ అయ్యాయి. కుడికాలు నొప్పి కారణంగా ఎడమ కాలిపై వేయడంతో ఇప్పుడు రెండు కాళ్లలోకి ఆ వ్యాధి పాకింది. దాంతో చాలా బాధపడ్డాను అంటూ నోయల్ సీన్ చెప్పారు.

    రెండు కాళ్లు బిగుసుకుపోయి..

    రెండు కాళ్లు బిగుసుకుపోయి..

    ఇక యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాధి కారణంగా రెండు కాళ్లు ఉదయాన్ని ఎక్కువగా బిగుసుకుపోతాయి. ఆ బాధతోపాటు స్విమ్మింగ్ పూల్ వద్ద వేలు కట్ అయింది. దాంతో బాధ మరింత పెరిగింది. దాంతో చాలా ఇబ్బంది పడ్డాను. కానీ దానిని బయటకు చూపించలేకపోయాను అంటూ నోయల్ సీన్ చెప్పారు. దాంతో నీకు ఎంత బాధ ఉన్నా నీవు కనిపించకుండా గేమ్ చక్కగా ఆడావు. నీవంటే ఇంటి సభ్యులకు ఎంతో ప్రేమ అంటూ నాగార్జున ఓదార్చే ప్రయత్నం చేశారు.

    వ్యాధిని, నొప్పిని భరించే శక్తి లేదు

    వ్యాధిని, నొప్పిని భరించే శక్తి లేదు

    నాగార్జున మాటలకు స్పందిస్తూ.. వాస్తవానికి నేను ఇన్ని రోజులు ఇంటిలో ఉన్నానంటే.. ప్రేక్షకులు, ఇంటి సభ్యుల ప్రేమ వల్లనే. వారి ప్రేమ వల్ల నా బాధను మరిచిపోయాను. కానీ నా వ్యాధిని, నొప్పిని భరించే శక్తి నా పరిధి దాటింది. అందుకే నేను ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నేను ఏమి చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది అంటూ నోయల్ చెప్పారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌లో నోయల్ జర్నీ వీడియోను నాగ్ చూపించాడు.

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి?

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ అంటే ఏమిటి?

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాధి అతిగా బాధపట్టే ఎముకల వ్యాధి. క్రమంగా ఎముకల పనితీరును నిర్వీర్యం చేస్తుంది. దేహంలోని వెన్నుముకలోని చిన్న ఎముకలపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల దేహంలోని పలు అంగాలపై ప్రభావం పడుతుంది. దాంతో వెన్నుముక ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. నడక తీరును, నిలబడే విధానం మారిపోతుంది. ఈ వ్యాధి ప్రభావం పక్కటెముకలపై పడితే శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వల్ల తలెత్తే సమస్యలు ఇలా..

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వల్ల తలెత్తే సమస్యలు ఇలా..

    యాంకిలాసింగ్ స్పాండిలైటిస్ వ్యాధి వల్ల ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. కంటిలో మంట, కంటి చూపు మందగించడం లాంటి సమస్యలు రావొచ్చు. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధికి ఆరంభంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

    English summary
    Akkineni Nagarjuna Hosts Bigg Boss Telugu 4 after break, Earlier week, Samantha Akkineni hosts Dasara Maha Episode. Noel Sean out from the Bigg Boss house due health reasons. He is suffering with Ankylosing spondylitis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X