బిగ్‌బాస్3 గురించి ఎన్టీఆర్ క్లారిటీ.. అలా తొంగి చూడటమంటే భలే సరదా!

Recommended Video

Bigg Boss Season 3 Telugu : NTR Responds On Bigg Boss 3

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే. తన సమయస్ఫూర్తి, యాక్టింగ్ టాలెంట్‌తో ప్రేక్షకులను రంజింపజేశారు. వ్యక్తిగత కారణాలు, సినిమా షూటింగ్ బిజీ కారణంగా బిగ్‌బాస్2కు దూరమయ్యారు. దాంతో ఆ అవకాశం నానికి చిక్కింది. అయితే నాని ఎన్టీఆర్ రేంజ్‌లో చేయలేకపోయారే మాట వినిపించింది. దాంతో బిగ్‌బాస్ సీజన్ 3కి ఎన్టీఆర్ హోస్ట్‌గా వస్తున్నాడనే వార్తలను ఆయన వద్ద ప్రస్తావించగా.. దానికి గురించి వివరణ ఇచ్చారు. బిగ్‌బాస్ 3 గురించి ఎన్టీఆర్ ఏమని వివరణ ఇచ్చారంటే..

బిగ్‌బాస్ తెలుగు2 చూడలేదు

బిగ్‌బాస్ తెలుగు2 చూడలేదు

బిగ్‌బాస్ తెలుగు 2 కార్యక్రమాన్ని ఫాలో కాలేదు. అరవింద సమేత షూటింగ్, నాన్న మరణంతో కలిగిన విషాదంతో చూడలేకపోయాను. అంతేకాకుండా నా ఇద్దరు కొడుకులతో గడపడంతోనే సరిపోతుంది. అందులో రెండో కొడుకు వచ్చాడు. వాడితో ఆడుకోవడం సరదాగా ఉంది.

బిగ్‌బాస్ మైలురాయిగా నిలవడం లక్కీ

బిగ్‌బాస్ మైలురాయిగా నిలవడం లక్కీ

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 ప్రారంభించే అవకాశం రావడం. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం సంతోషం కలిగింది. ఇంకా అదో మైలురాయిగా నిలిచిందని అందరూ అనడం నిజంగా లక్కీ. అది కేవలం రియాలిటీ షోగా భావించను. ఎందుకంటే హోస్ట్‌గా వ్యవహరించడమంటే సమయస్పూర్తి, అన్ని రకాల టాలెంట్స్‌ను అప్పటికప్పుడు ప్రదర్శించాలి. అది ఓ పెద్ద ఛాలెంజింగ్‌గా భావించాను.

ప్రపంచం గురించి ఏమో గానీ..

ప్రపంచం గురించి ఏమో గానీ..

బిగ్‌బాస్ షోను హోస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం పరిచయం అవుతుందో లేదో తెలియదు గానీ.. అందులో ఉండే ప్రతీ ఒక్కరి జీవితాల్లో జరిగే మొత్తం తెలిసిపోతుంది. బిగ్‌బాస్ 1 మొదలుపెట్టే సమయంలో నేను స్వయంగా ఏం చెప్పానంటే.. ఇతరులు జీవితంలో తొంగి చూడటమంటే నాకు భలే సరదా.

బిగ్‌బాస్ తెలుగు 3‌కు హోస్ట్‌గా

బిగ్‌బాస్ తెలుగు 3‌కు హోస్ట్‌గా

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తానో లేదో చెప్పలేను. ఎందుకంటే దాని గురించి ఇప్పుడే చెప్పడం ముందస్తుగా స్పందించడమే అవుతుంది. అన్నీ భాషల్లో సక్సెస్ ఫుల్ ఫార్మాట్ అది. రాజమౌళి సినిమా షెడ్యూల్‌ను బట్టి చేయాలా? వద్దా అనే విషయం ఆధారపడి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X