»   » తెలుగులో ‘బిగ్ బాస్’.... బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్!

తెలుగులో ‘బిగ్ బాస్’.... బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్న ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్' త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. తెలుగు వెర్షన్లో రాబోతున్న ఈ షోను టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు.

ఇటీవలే స్టార్ నెట్వర్క్‌లో విలీనం అయిన 'మా టీవీ' తెలుగు వెర్షన్ 'బిగ్ బాస్' ప్రసారం చేయబోతోంది. ఈ విషయమై మాటీవీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ షో ద్వారా తొలిసారిగా జూ ఎన్టీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది.

ఎన్నో వివాదాలు

ఎన్నో వివాదాలు

హిందీలో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్' షోపై ఎన్నో వివాదాలున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే సెలబ్రెటీల ప్రవర్తన చాలా వివాదస్పదంగా ఉండటమే అందుకు కారణం. మరి తెలుగులోనూ అదే తరహాలో వివాదాస్పదంగా ఈ షోను సాగిస్తారా? అనేది సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఈ షోను ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నట్లు మాటీవీ వారు అధికారికంగా ప్రకటించారు. తారక్ తొలి సారిగా బుల్లితెరపై ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త అభిమానుల్లో చర్చనీయాంశం అయింది. ఈ షో కోసం మాటీవీ వారు ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మాటీవీలో...

మాటీవీలో...

ఇప్పటికే హిందీ నుండి ‘కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమాన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'గా తీసుకొచ్చిన మాటీవీ వారే..... ఇపుడు ‘బిగ్ బాస్' షోను తెలుగులోనూ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

టీఆర్పీ రేటింగ్సే లక్ష్యంగా...

టీఆర్పీ రేటింగ్సే లక్ష్యంగా...

హిందీలో బిగ్ బాస్ షోకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటంతో తెలుగులో కూడా ఈ షోకు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

English summary
As per our reliable sources, NTR has signed a deal with Star MAA channel to host Bigg Boss reality show in Telugu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu