twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR's Evaru Meelo Koteeswarulu..ఎన్టీఆర్ షోలో పులివెందుల అమ్మాయి.. గౌతమి ఎంత గెలచుకొన్నారంటే?

    |

    జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ గేమ్‌లో మంగళవారం ఎపిసోడ్ అంటే నవంబర్ 9వ తేదీన ప్రేరిత, గౌతమి అనే ఇద్దరు కంటెస్టెంట్లు హాట్ సీట్‌పైకి వచ్చారు. ప్రేరిత రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా వచ్చి మొదటి ప్రశ్నకు బయటకు వెళ్లిపోయారు. ఆతర్వాత పులివెందులకు చెందిన గౌతమి హాట్ సీట్‌పైకి వచ్చారు. అయితే ప్రేరిత, గౌతమి ఎంత గెలుచుకొన్నారంటే...

    రూ.40 వేల కోసం ప్రశ్న

    రూ.40 వేల కోసం ప్రశ్న

    అక్టోబర్ 2021లో, ఆఫ్రికాలో ప్రమాదంలో ఉన్న పిల్లల కోసం WHO ఏ వ్యాధికి వ్యతిరేకంగా మొదటి టీకాను సిఫార్సు చేసింది?
    a) ఎయిడ్స్
    b) మలేరియా
    c) జికా
    d) ఎబోలా

    పై ప్రశ్నకు రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా హాట్ సీట్‌పైకి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన ప్రేరిత సమాధానం చెప్పలేకపోయింది. 50:50 లైఫ్ లైన్ ఆప్షన్‌ను ఎంచుకొన్నది. అయితే స్క్రీన్ పై వచ్చిన సమాధానాల్లో మలేరియా, జీకా ఉంటే... జికా అని సమాధానం చెప్పారు. జికా సమాధానం తప్పు కావడంతో గేమ్ నుంచి ప్రేరిత బయటకు వెళ్లిపోయింది.

    Answer: మలేరియా

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న

    హైదరాబాద్‌కు చెందిన ప్రేరిత గేమ్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో మరోసారి ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్నను తెరపైకి తెచ్చారు.

    ఈ నీటి వనరులను వాటి నీటి పరిమాణం ప్రకారం ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి
    a) హుస్సేన్ సాగర్
    b) గోదావరి నది
    c) ఒలంపిక్ స్మిమ్మింగ్ పూల్
    d) హిందూ మహా సముద్రం

    పై ప్రశ్నకు వేగంగా సమాధానం చెప్పిన పులివెందులకు చెందిన గౌతమి హాట్ సీట్‌పైకి వచ్చింది. గౌతమి ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుకొంటున్నారు. తనకు వచ్చే పారితోషికంలో సగం తల్లిదండ్రులకు, మిగితా మానసిక రుగ్మతతో బాధపడే వారికి సేవ చేసే స్వచ్చంద సంస్థకు సగం ఇస్తానని చెప్పారు.

    Answer: D, B, A, C

    1000 రూపాయల కోసం ప్రశ్న

    1000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ సేవలలో BSNL ద్వారా ప్రధానంగా అందించబడేది ఏది?
    a) ఆహారం
    b) ఫోన్
    c) విమానం
    d) రైల్వే

    Answer: ఫోన్

     2000 రూపాయల కోసం ప్రశ్న

    2000 రూపాయల కోసం ప్రశ్న

    హిందూ పురాణాలలో, విష్ణువు రెండో అవతారం ఏమిటి?
    a) రామ
    b) కల్కి
    c) కూర్మము
    d) కృష్ణ

    Answer: కూర్మము

    3000 రూపాయల కోసం ప్రశ్న

    3000 రూపాయల కోసం ప్రశ్న

    శ్రీ సత్యసాయి విమానాశ్రయం ఎక్కడ ఉంది?
    a) విజయవాడ
    b) పుట్టపర్తి
    c) తిరుపతి
    d) గుంటూరు

    Answer: పుట్టపర్తి

    5000 రూపాయల కోసం ప్రశ్న

    5000 రూపాయల కోసం ప్రశ్న

    క్రికెట్‌లో లార్డ్స్, ఈడెన్ గార్డెన్స్ మరియు చెపాక్ అనేవి దేనికి పేర్లు?
    a) స్టేడియంలు
    b) అంపైర్లు
    c) చట్టాలు
    d) స్పాన్సర్లు

    Answer: స్టేడియంలు

    10000 రూపాయల కోసం ప్రశ్న

    10000 రూపాయల కోసం ప్రశ్న

    వీటిలో ఏది ఒక బియ్యం రకం కాదు?
    a) ప్రతిభ
    b) స్వర్ణ
    c) బాస్మతి
    d) బంగినపల్లి

    Answer: బంగినపల్లి

    20000 రూపాయల కోసం ప్రశ్న

    20000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ చిత్రంలో కనపడే విప్లవకారుడుని గుర్తించండి
    a) చే గువేరా
    b) ఫిడేల్ కాస్ట్రో
    c) కార్ల్ మార్క్స్
    d) జోసఫ్ స్టాలిన్

    Answer: చే గువేరా

    40000 రూపాయల కోసం ప్రశ్న

    40000 రూపాయల కోసం ప్రశ్న

    ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు ప్రదేశం వీటిలో ఏ జిల్లాలో ఉంది?
    a) విజయనగరం
    b) శ్రీకాకుళం
    c) విశాఖపట్నం
    d) తూర్పు గోదావరి

    Answer: శ్రీకాకుళం

    80000 రూపాయల కోసం ప్రశ్న

    80000 రూపాయల కోసం ప్రశ్న

    ఈ సముద్ర జీవులలో ఏది దంతాలను కలిగి ఉంది?
    a) టైగర్ షార్క్
    b) బ్లూ వేల్
    c) సీ ఆనిమోన్
    d) నీటి గుర్రం

    Answer: టైగర్ షార్క్

    160000 రూపాయల కోసం ప్రశ్న

    160000 రూపాయల కోసం ప్రశ్న

    2021లో, ఏ నగరం 2032 ఒలంపిక్ క్రీడలకు వేదికగా ప్రకటించబడినది?
    a) బర్మింగ్ హమ్
    b) బోస్టన్
    c) బెర్లిన్
    d) బ్రిస్బేన్

    పై ప్రశ్నకు గౌతమి సమాధానం తెలియకపోవడంతో లైఫ్‌లైన్ ఉపయోగించుకొన్నారు. మొదట ఆడియెన్స్ పోల్ ఆప్షన్‌ను ఉపయోగించుకోగా.. ఆడియెన్స్ చెప్పిన సమాధానంపై సందేహం ఉండటంతో 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. ఆమె చెప్పిన సమాధానం సరియైనది కావడంతో గేమ్‌లో ముందుకు వెళ్లారు. ఈ ప్రశ్నకు రెండు లైఫ్‌లైన్లు ఉపయోగించుకొన్నారు.

    Answer: బ్రిస్బేన్

    320000 రూపాయల కోసం ప్రశ్న

    320000 రూపాయల కోసం ప్రశ్న

    ఏప్రిల్ 2018లో, అడాప్ట్ ఏ హెరిటేజ్ పథకం కింద దాల్మియా భారత్ గ్రూప్ ఏ కట్టడ బాధ్యతలు చేపట్టడానికి ఎంఓయూ సంతకం చేసింది?
    a) కొండవీడు కోట
    b) కొండపల్లి కోట
    c) ఫలక్‌నుమా ప్యాలెస్
    d) గండికోట కోట

    Answer: గండికోట కోట

    Recommended Video

    Samantha : NTR కోసం మొదటిసారి సమంత అలా Naga Chaitanya ఎక్కడా తగ్గట్లేదుగా | RRR || Filmibeat Telugu
    వీరిలో ఉత్తర అమెరికా ఖండానికి చేరుకొన్న మొదటి యూరోపియన్ అన్వేషకుడు ఎవరు?

    వీరిలో ఉత్తర అమెరికా ఖండానికి చేరుకొన్న మొదటి యూరోపియన్ అన్వేషకుడు ఎవరు?

    a) క్రిస్టఫర్ కొలంబస్
    b) అమెరిగో వెస్పుచి
    c) వాల్టర్ రాలీ
    d) లీఫ్ ఎరిక్సన్

    640000 రూపాయల కోసం ప్రశ్న
    పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే కాలర్ క్రిస్టఫర్ కొలంబస్ అని సమాధానం చెప్పడంతో అదే జవాబును గౌతమి లాక్ చేసశారు. కానీ ఆ ప్రశ్న తప్పు కావడంతో 320000 రూపాయలతో గేమ్ నుంచి బయటకు వెళ్లారు.

    Answer: లీఫ్ ఎరిక్సన్

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show November 9th Episode: Two contestants participated in the game. One is Prerita, another is Gowtami from Pulivendula.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X