Just In
- 4 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 30 min ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 11 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
Don't Miss!
- News
అగ్రవర్ణాలకు గుడ్ న్యూస్ చెప్పనున్న సీఎం కేసీఆర్...? 2-3 రోజుల్లో ప్రకటన వచ్చే ఛాన్స్...?
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'Ntv'ప్రసారాల పై నిషేధం...హైకోర్టుకు కేసు
హైదరాబాద్: కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించామంటూ 'ఎన్ టీవీ'ఛానల్ ప్రసారాలను వారంరోజుల పాటు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుచేయాలంటూ టీవీ యాజమాన్యం మంగళవారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేసింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సంబంధిత ఉత్తర్వులను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించి వాటిని కొట్టివేయాలని అభ్యర్థిస్తూ.. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ టి.రమాదేవి తన వ్యాజ్యంలో కోరారు. 2012లో ఫిబ్రవరి నుంచి మే వరకు ఎన్‌టీవీలో మధ్యరాత్రి 'సిని కలర్స్' పేరుతో ప్రసారం అయిన పాటల్లో అశ్లీలత చోటుచేసుకుంటోందంటూ ఓ వ్యక్తి సమర్పించిన ఫిర్యాదు అధారంగా తమకు 2014 ఆగస్టు 7న సంబంధిత మంత్రిత్వశాఖ షోకాజ్ నోటీసు జారీచేసిందన్నారు.
ఆ ఆరోపణలను ఖండిస్తూ ఆదే నెల్లో వివరణ ఇచ్చామని, వ్యక్తిగతంగానూ హాజరై వివరించామని పేర్కొన్నారు. తమ వాదనలను పట్టించుకోకుండా టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ ఈనెల 19న ఆదేశాలు జారీచేసిందన్నారు. 2012లోనే ఈ కార్యక్రమాన్ని నిలుపు చేశామన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
తమ చానల్ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నిషేధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
కేంద్ర ప్రభుత్వం గత నెల 19న జారీ చేసిన ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆ సంస్థ డెరైక్టర్ టి.రమాదేవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు.
గతంలో ఎన్‌టీవీలో రాత్రి 11.30 గంటలకు సినీకలర్స్ పేరుతో ప్రసారమయ్యే కార్యక్రమంలోని పాటల్లో అసభ్యత, అశ్లీలత ఉంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ కార్యక్రమ డీవీడీలను పరిశీలించింది. అందులో అశ్లీలత, అసభ్యత ఉంటోందని, వీక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఈ కార్యక్రమం లేదని తేల్చింది.
ఇది కేబుల్ టీవీ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఎన్‌టీవీ ప్రసారాలను ఫిబ్రవరి 3 నుంచి వారం రోజుల పాటు నిషేధిస్తున్నట్లు ఆ శాఖ డెరైక్టర్ నీతి సర్కార్ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 2012, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంపై కేంద్రానికి రాతపూర్వకంగా వివరణ ఇచ్చామని పిటిషన్‌లో ఎన్‌టీవీ డెరైక్టర్ పేర్కొన్నారు.
ఆ కార్యక్రమాన్ని 2012లోనే నిలిపేశామని, దానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సరికాదన్నారు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, నిషేధం విధించే అధికారం డెరైక్టర్‌కు లేదని,నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా ఆమె కోర్టును అభ్యర్థించారు.