»   » టీవీ నటి అరెస్టు, సహ నటుడి ఆత్యహత్యతో సంబంధం?

టీవీ నటి అరెస్టు, సహ నటుడి ఆత్యహత్యతో సంబంధం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒడిషాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన ఒకటి చర్చనీయాంశం అయింది. టీవీ నటుడు రంజిత్ పట్నాయక్ అలియాస్ రాజా అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య కేసులో మరో నటి ప్రలిప్త ప్రియదర్శిని సమల్ అలియాస్ జెస్సీని పోలీసులు అరెస్టు చేసారు.

రంజిత్ పట్నాయక్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.... జెస్సీతో గొడవ పడ్డాడు. అనంతరం వంతెన మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో అనేక అనుమానాలు ఉండటంతో పోలీసులు జెస్సీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముందు ఆమెను బాలాసూర్ కోర్టు ముందు హాజరు పరిచి 14 రోజుల పాటు జెడీషియల్ కస్టడీకి తరలించారు.

ఆమె ట్వీట్ సంచలనం: రూ. 81 కోట్ల సంపాదన!

Odiya TV actress Jessy arrested

గొడవ ఎందుకు?
ఒడిషాలో ఇటీవల జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో జెస్సీతో పాటు, చందన్ అనే ఆర్టిస్ట్ పాల్గొనాల్సి ఉంది. పలు కారణాలతో చందన్ ఈ కార్యక్రమానికి రాలేక పోయాడు. అయితే ఎలాంటి ఆహ్వానం అందక పోయినా అక్కడికి రంజిత్ పట్నాయక్ వచ్చారు. చందన్ రాలేదు కాబట్టి నిర్వాహకుల అభ్యర్థన మేరకు షోలో పాల్గొన్నాడు రంజిత్.

మీలో ఎవరు కోటీశ్వరుడు: ఆ మొత్తం దానం చేసాడు!

అయితే షో ముగిసిన అనంతరం..... జెస్సీకి రూ. 27 వేలు చెల్లించి, రంజిత్ కు కేవలం 2 వేలు మాత్రమే చెల్లించారు. దీంతో అక్కడే వివాదం మొదలైంది. తర్వాత జెస్సీ, రంజిత్ ఒకే కారులో బయల్దేరారు. కారులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. జెస్సీ వ్యాఖ్యలతో హర్ట్ అయిన రంజిత్ డ్రైవర్ ను వంతెన వద్ద కారు ఆపమని చెప్పి....దానిపై నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.... అయితే ఇది ఆత్మహత్యేనా? లేక మరేదైనా కారణం ఉందా అనేదానిపై పోలీసులు వివిధ కోణాల్లో ద్యాప్తు చేసుకున్నాడు.

Read more about: tv tollywood
English summary
Popular Odiya television actress Pralipta Priyadarshini Samal alias Jessy was arrested on Tuesday by Odisha Police on the charge of instigating her male colleague Ranjit Patnaik alias Raja to commit suicide. She was produced before the Balasore Judicial Magistrate (First Class) Babita Das who sent her to judicial custody for 14 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu