'పాడుతాతీయగా' ఎనిమిదో సిరీస్ ఈ రోజు నుంచే...

'పాడుతాతీయగా'.. పరిశ్రమకు నూతన గాయనీ గాయకుల్ని అందించే వేదికగా, సంగీతాభిమానులకు వీనుల విందు చేసే కార్యక్రమంగా ప్రసిద్ధికెక్కింది. ఇందులో పాల్గొన్న వారిలో ఎంతోమంది తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ రాణిస్తున్నారు. బాల గాయనీ గాయకులకు కూడా ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలుస్తోంది.
ప్రస్తుత కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8 నుంచి 14 ఏళ్ల వయసున్న నాలుగు వేల మంది బాలబాలికల్ని ఎంపిక చేశారు. వివిధ దశల్లో వారికి పోటీలు నిర్వహించి 80 మందిని ఎంచుకున్నారు. అందులోంచి ఆఖరికి 21 మందిని ఎంపిక చేశారు బాల సుబ్రహ్మణ్యం. వీరి మధ్య ఈ స్వర సమరం జరగబోతోంది. తొలి ఎపిసోడ్‌లో సంగీత దర్శకుడు రమణ గోగుల పాల్గొంటున్నారు.
''నన్ను అందరూ మ్యూజికల్ అకాడమీ పెట్టకూడదా అని అడుగుతుంటారు. 'పాడుతా తీయగా' లాంటి కార్యక్రమం ఉండగా ఇంకో అకాడమీ ఎందుకు? ఆ కార్యక్రమమే నాకు మ్యూజికల్ అకాడమీ లాంటిది'' అని ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అంతగా ఆయన మనసు దోచిన ఈ కార్యక్రమంలో మరో అంకానికి తెరలేస్తోంది.
'పాడుతా తీయగా' ఈ సోమవారం నుంచి 'ఈటీవీ'లో రాత్రి 9.30కి ప్రసారమవుతుంది.


Click it and Unblock the Notifications











