»   » యాంకర్ ఎలా ఉండాలో తెలుసుకో....! సుమ పై రెచ్చిపోయిన పార్టిసిపెంట్

యాంకర్ ఎలా ఉండాలో తెలుసుకో....! సుమ పై రెచ్చిపోయిన పార్టిసిపెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ రెండువారాల క్రితం జబర్దస్థ్ షో లో చేసిన "షో" గుర్తుందా..?? సుడిగాలి సుధీర్ టీమ్ ఇక ఉండదేమో అన్నంత హంగా మాచేసారు. తర్వాత ఎప్పటి లాగే అది పబ్లిసిటీ కోసం చేసిన గొదవ అని అర్థమయ్యింది. జబర్దస్త్ అనే కాదు చాలా వరకూ రియాలిటీ షో లల్లో ఇలా కావాలనే కొన్ని గొడవలు చేసి ప్రోమోల్లో దాన్ని ప్రచారం చేయటం... వారమంతా ఎదురు చూసిన జనం దాన్ని నిజం అనుకొని ఫూల్స్ అయిపోవటం.

ఓంకారన్నయ్య

ఓంకారన్నయ్య

గతం లో ఓంకారన్నయ్య నిర్వహించే షోలలో ఎక్కువగా జరిగేది. ఈ మధ్య ఈ టీవీ కోసం మల్లెమాల టీవీ ప్రొడక్షన్ లో చాలా రియాలిటీ షోలు మొదలయ్యాయి. మరి వీటికి కూడా రేటింగూ పబ్లిసిటీ కావాలికదా. అందుకే ఈ కల్పించే కాంట్రవర్సీలన్నమాట. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సీనియర్ యాంకర్ సుమ నిర్వహించే స్టార్ మహిళ ప్రోగ్రాం లో కూడా ఇంకో గొడవ జరిగినట్టు చూపించారు.

నీకేమైనా పిచ్చా?

నీకేమైనా పిచ్చా?

"స్టార్ మహిళ కార్యక్రమంలో యాంకర్ సుమపై షోలో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళ రెచ్చిపోయింది. తను చెప్పిన సమాధానమే రైట్ అని వాదనకు దిగిన ఆ మహిళ "నీకేమైనా పిచ్చా?" అని సుమ అనడంతో మరింత రెచ్చిపోయిన ఆమె నీకు పిచ్చి, నీ మొగుడు రాజీవ్ కనకాలకు పిచ్చి అనే రేంజికి వెళ్లిపోయింది.

గెటౌట్ ఆఫ్ మై షో

గెటౌట్ ఆఫ్ మై షో

పార్టిసిపెంట్ ఎలా ఉండాలో తెలుసుకోమని సుమ అంటే.. యాంకర్ ఎలా ఉండాలో నువ్ తెలుసుకో అని సుమకు గట్టి రిటార్ట్ ఇచ్చింది ఆమె. మాటకు మాట ఎదురయ్యేసరికి సహనం కోల్పోయిన సుమ గెటౌట్ ఆఫ్ మై షో అనేసింది.." అయితే ఇదంతా పైకి సీరియస్ గా కనిపించినా..

తెగ నవ్వుతూనే ఉందీ

తెగ నవ్వుతూనే ఉందీ

కామెడీ తంతే అని చాలామందికే అర్థమయ్యింది.... ఎందుకంటే సుమ అద్బుతంగానే నటించినా... సదరు స్టార్ కాబోయే మహిళమాత్రం మొదటినుంచీ "గెట్ ఔట్" అనిపించుకొని వెళ్ళేటప్పుడు కూడా తెగ నవ్వుతూనే ఉందీ... నవ్వుతూనే షోనుంచి బయటకు నడిచింది.

స్టార్ మహిళ

స్టార్ మహిళ

మామూలు షో లకైతే పరవాలేదు కానీ ఆఖరికి సుమ నిర్వహించే సక్సెస్ ఫుల్ ప్రోగ్రాం స్టార్ మహిళ, సుధీర్ఘ కాలం నడిపిన రియాలిటీ షో గా అవార్డు కూడా వచ్చిన షో ఇది. ఇక్కడ కూదా ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటం మాత్రం కాస్త వింతగానే ఉంది. అసలు అంత సీరియస్ గొడవ నిజమైతే గనక, తర్వాత ఎడిట్ చేస్తారు,

ప్రోగ్రాం చేసేటప్పుడే

ప్రోగ్రాం చేసేటప్పుడే

లేదంటే అసలు ప్రోగ్రాం చేసేటప్పుడే డైరెక్టర్ కట్ చెప్పి ఆపేవీలుంది. మరీ "మీ ఆయనకు పిచ్చి" లాంటి సిల్లీ తిట్లు కోపం లో ఉన్నప్పుడు తిట్టినా తర్వాత తీసెస్తారు కానీ... "రాజీవ్ కనకాలకి పిచ్చని ఫలానా షో లో అన్నారహో..!" అంటూ దాన్ని టెలీకాస్ట్ చెయ్యరన్న సంగతి కనీస ఆలోచన ఉన్నవాడికైనా అర్థమైపోతుంది. సరే ఈ నాలుగు రోజులూ ఆగితే అసలు విషయమేమిటో తెల్సిపోతుంది కదా... ఆ వీడియో ఓ సారి చూసేయండి....

English summary
During Star Mahila programme, a participant entered into an argument with anchor Suma Kanakala over a question and answer. Both exchanged verbal duel on personal matters. Finally, the participant was told to quit the programme.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu