»   » రాత్రి గొడవ నిజమే, రక్తం మరకలు: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై భార్య స్పందన!

రాత్రి గొడవ నిజమే, రక్తం మరకలు: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యపై భార్య స్పందన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య ఘటనపై అతడి భార్య పావని మీడియాతో స్పందించారు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే గదిలో చేతిపై గాయం, రక్తపు మరకలు ఎందుకు వచ్చాయనే దానిపై ఆమె వివరణ ఇచ్చారు.

ప్రదీప్ షూటింగు నుండి రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారని, షూటింగులో బాగా అలసి పోయిన ఆయన తర్వాత బాగా డ్రింక్ చేసారని, ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల వాదన జరిగిందని, దీనితో ఆయన అలిగి రూమ్ లో వెళ్లి డేర్ వేసుకున్నారని, తెల్లవారు ఝామున 5 గంటలకు ఆయనకు షూటింగ్ ఉందని లేపడానికి డోర్ కొడితే తీయలేదని, అనుమానం వచ్చి డోర్ బద్దలు కొడితే ఉరి వేసుకుని కనిపించారని పావని తెలిపారు.

రక్తపు మరకలు అందుకే

రక్తపు మరకలు అందుకే

రాత్రి ఆయనతో చిన్న వాదన జరిగింది. దాన్ని గొడవ అని నేను అనను. చిన్న మిస్ అండర్ స్టాండింగ్. ఆ సమయంలో మా అన్నయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను మీకు ఇష్టం లేదని చెప్పి బాత్రూంలోకి వెళ్లి డోర్ పెట్టుకుని ఏడ్చాను. ఆయన వచ్చి డోర్ కొట్టినా తీయలేదు. కోపంతో ఆయన అద్దం పగలగొట్టారు. నేను వెంటనే తలుపు తీసుకుని బయటకు వచ్చా నాకు ఈ వయోలెన్స్ వద్దని చెప్పి పక్కన వెళ్లి కూర్చున్నాను... ఆయన చేతితో అద్దం పగలకొట్టడం వల్లనే రక్తం మరకలు అయ్యాయని పావని తెలిపారు.

చిన్న విషయానికే అలిగి ఆత్మహత్య

చిన్న విషయానికే అలిగి ఆత్మహత్య

చిన్న విషయానికే అలిగి లోనికి వెళ్లారు. తెల్లవారు ఝామున 5 గంటలకు ఆయన ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుందని పావనతి తెలిపారు. తమ మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగే తప్ప ప్రత్యేకంగా ఓ కారణంతో పెద్ద గొడవలు జరుగలేదని తెలిపారు పావని.

దీన్ని గొడవగా చూడొద్దు

దీన్ని గొడవగా చూడొద్దు

తమ మధ్య జరిగింది వాదన మాత్రము, అది అసలు గొడవే కాదని పావని వ్యాఖ్యానించారు. భార్య భర్తల మధ్య ఎన్నో పెద్ద గొడవలు జరుగుతాయి. దానితో పోల్చితే తమ మధ్య రాత్రి జరిగింది గొడవే కాదని ఆమె అన్నారు. తెల్లవారు ఝామున 4 గంటలకు తనతో వాదన తర్వాత అలిగి వెళ్లి పడుకున్నాడని తెలిపారు.

పార్టీలో బాగానే ఉన్నారు

పార్టీలో బాగానే ఉన్నారు

రాత్రి తన అన్నయ్య (ప్రదీప్ కు బావమరిది) బర్త్ డేని సెలబ్రేట్ చేడని, అపుడే మద్యం తీసుకున్నారని, పార్టీ అయిపోయిన తర్వాత చిన్న కారణంతో తనతో వాదన మొదలైందని పావని తెలిపారు. ఈ క్రమంలోనే ఇదంతా జరిగింది. ఆయన ఆత్మహత్య చేసుకుంటారని అసలు అనుకోలేదని పావని తెలిపారు.

English summary
TV actress Pavani reacts on her husband Pradeep suicide. Popular television actor Pradeep's reportedly committed suicide on wednessday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu