»   » బిగ్ బాస్ విజేత: శివ బాలాజీ వెనక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఎందుకు?

బిగ్ బాస్ విజేత: శివ బాలాజీ వెనక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఎందుకు?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan

  తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాల్టీ షో తెలుగు టెలివిజన్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టెలివిజన్‌ను భారీ రేటింగ్‌తో అగ్రస్థానాన నిలబెట్టింది. అనూహ్య మలుపుల మధ్య తొలి బిగ్‌బాస్‌లో విజేతగా నటుడు శివబాలాజీగా నిలువడం విశేషం. బిగ్‌బాస్1 విజేతగా నిలువడానికి శివ బాలాజీ ఆడిన తీరు, ప్రవర్తించిన విధానం శివబాలాజీకి కలిసివచ్చింది అనే మాట వినిపిస్తున్నది. ఇదిలా ఉండగా శివబాలాజీ విజేతగా నిలువడానికి మరో కోణం ఉందనే రూమర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అదేమిటంటే..

  ముక్కు సూటి వ్యక్తిత్వం

  ముక్కు సూటి వ్యక్తిత్వం

  బిగ్‌బాస్ ఆరంభంలోనే హౌస్‌లోకి వెళ్లిన సభ్యుల్లో శివబాలాజీ ఒకరు. ప్రారంభం నుంచే ముక్కుసూటిగా వ్యవహరించడం ఆకట్టుకొన్నది. ఇంటి సభ్యుల్లో తనకు నచ్చని వారితో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు. నచ్చని విషయాన్ని ముఖంపైనే చెప్పేవారు. తొలుత బిగ్‌బాస్ హౌస్‌లో వివాదాస్పదుడు అనే ముద్ర పడింది.

  కోపం.. దూకుడు ఆయన లక్షణం

  కోపం.. దూకుడు ఆయన లక్షణం

  అలా బిగ్ బాస్‌లో శివ బాలాజీ తనదైన శైలిలో రాణించారు. కోపంతోపాటు దూకుడుగా వ్యవహరించడం ఆయన శైలిగా కనిపించింది. ఇంటి సభ్యుల్లో శివ బాలాజీది ప్రత్యేకమైన పంథా. తనకు నచ్చని విషయాన్ని ఎదుటి వారి ముఖంపై చెప్పడానికి వెనుకాడరు. ఇంటి సభ్యులనే కాకుండా బిగ్ బాస్ ను చెడామడా తిట్టిన సందర్భాలు తెలిసిందే.

  బిగ్‌బాస్‌ను చివాట్టు పెట్టిన ఘనుడు

  బిగ్‌బాస్‌ను చివాట్టు పెట్టిన ఘనుడు

  మురికి నీళ్లపై స్నానం ఎలా చేస్తాం. మేం మనుషులను కాదనుకున్నారా ? లేదా గతి లేక ఈ షో కు వచ్చామా అని తీవ్ర స్థాయిలో బిగ్ బాస్ ను మందలించారు. అప్పుడే శివ బాలాజీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రతిసారి తప్పించుకున్నారు. దాని వెనుక పవన్ ఫ్యాన్స్ అండ ఉన్నారనే మాట వినిపించింది.

  ఇంటికి పెద్ద దిక్కుగా

  ఇంటికి పెద్ద దిక్కుగా

  అయితే బిగ్‌బాస్ హౌస్‌లో శివబాలాజీ బలమైన అభ్యర్థిగా మారడానికి అసలు కారణం ఒకటి ఉంది. సభ్యులు చాలా పరిణతితో వ్యవహరించకుండా ప్రవర్తిస్తున్న సమయంలో శివబాలాజీ పెద్ద దిక్కుగా మారాడు. ఇంటిలో వంట పనులన్నింటినీ భుజాన వేసుకొన్నాడు. పరిమితితో నిత్యావసర వస్తువులను సరఫరా చేసిన నేపథ్యంలో సభ్యులకు ఆహార లోటు లేకుండా వ్యవహరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకొన్నది.

  టాస్కుల్లోనూ మేటి..

  టాస్కుల్లోనూ మేటి..

  శివ బాలాజీ తన ప్రవర్తనతోనే కాకుండా టాస్క్‌లను సమర్థవంతంగా పూర్తి చేస్తూ అలరించాడు. అలాగే కీలక సమయాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించడం గేమ్‌లో అగ్రస్థానికి చేరడానికి కారణమైంది. కొన్నివారాలపాటు ఎలిమినేషన్ తప్పించుకోవడంతోపాటు చాపకింద నీరులా ఇతర సభ్యులకు కొరకరాని కొయ్యగా మారారు.

  హరితేజ, ఆదర్శ్‌లకు గట్టిపోటి

  హరితేజ, ఆదర్శ్‌లకు గట్టిపోటి

  బిగ్‌బాస్‌లో మొదటి నుంచి బలమైన అభ్యర్థిగా నిలిచిన హరితేజ, ఆదర్శ్‌లకు గట్టిపోటి ఇచ్చాడు. తన ఆట, పాటలతో నిత్యం ప్రేక్షకులను ఆకట్టుకొన్న హరితేజ అందరూ విజేత అవుతారని ఊహించారు. కానీ చివరకు ఆమె ఆదర్శ్ కంటే ముందుగా ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే శివబాలాజీ విజేతగా నిలువడం వెనుక తన సొంత ప్రతిభతోపాటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అండ ఉందనే ప్రచారం జరుగుతున్నది.

  కాటమరాయుడి తమ్ముడికి ఫ్యాన్స్ అండ

  కాటమరాయుడి తమ్ముడికి ఫ్యాన్స్ అండ

  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇష్టమైన వ్యక్తుల్లో శివ బాలాజీ ఒకరు. పలు చిత్రాల్లో శివ బాలాజీకి అవకాశాలు కల్పించారు. తాజాగా వచ్చిన కాటమరాయుడు చిత్రంలో పవన్ కల్యాణ్ తమ్ముడిగా నటించాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా శివబాలాజీని పవన్ ఆదరిస్తాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

  పవన్‌కు శివబాలాజీ ఎంత ఇష్టమంటే..

  పవన్‌కు శివబాలాజీ ఎంత ఇష్టమంటే..

  పెద్దలను ఎదురించి శివబాలాజీ ప్రేమ వివాహం చేసుకొన్నప్పుడు పవన్ అండగా ఉన్నారు. వివాహా కార్యక్రమానికి స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అప్పటి నుంచి వీలున్నంత మేరకు తన సినిమాలో అవకాశాలు ఇప్పించడం, వ్యక్తిగతంగా ఇష్టపడటం చేస్తుంటాడు.

  పవన్ ఫ్యాన్స్ దండిగా..

  పవన్ ఫ్యాన్స్ దండిగా..

  అలా పవన్ ఇష్టపడే శివబాలాజీకి ఫ్యాన్స్ పూర్త మద్దతు తెలిపినట్టు ఫైనల్‌కు ముందే రూమర్ వైరల్ అయింది. శివబాలాజీకి పవన్ ఫ్యాన్స్‌తో మెగా అభిమానులు దండిగా ఓట్లు గుద్దినట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనప్పటికీ.. సమర్ధుడికే బిగ్‌బాస్ పట్టం కట్టారని సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

  ఎన్టీఆర్‌కు కూడా....

  ఎన్టీఆర్‌కు కూడా....

  శివ బాలాజీ జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా సన్నిహితుడే. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా శివబాలాజీకి ఓట్లు వేసి గెలిపించారని అంటున్నారు. ఓట్ల విషయంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మద్దతు పొందినప్పటికీ శివ బాలాజీ విజయంపై ఏ విధమైన వివాదం లేకపోవడం గమనార్హం. బిగ్ బాస్ షోలో శివ బాలాజీ ప్రదర్శించిన వ్యక్తిత్వం దాదాపుగా అందరనీ ఆకట్టుకుంది. ఓ పెద్ద మనిషిలా, హుందాగా ప్రవర్తించారు. కోపం వచ్చినప్పుడు దాన్ని అణచుకోలేదు కూడా. బయటపడ్డారు. ఆయన ప్రవర్తనలో నటన లేదని భావించడం కూడా ఆయనకు ఉపయోగపడి ఉండవచ్చు.

  నవదీప్ కూడా....

  నవదీప్ కూడా....

  నవదీప్ ఎంట్రీ తర్వాతనే బిగ్ బాస్ షో కాస్తా సందడిగా మారిందని చెప్పాలి. ప్రేక్షకులను ఆయన అలరించడానికి మంచి ప్రదర్శనే ఇచ్చారు. వినోదాన్ని పంచడానికి ఆయన నిత్యం ప్రయత్నించారు. ఆయన వైల్డ్ కార్డు ఎంట్రీ అనేది నవదీప్ విషయంలో ప్రతికూలంగా పనిచేసిందని భావించాలి.

  English summary
  Bigg Boss Telugu reality show, as Junior NTR host has reached to final stage. Grand Finale will be on September 24th. In this junxture, There is rumour that Pawan Kalyan's fans are supporing to contestant Shiva Balaji. We have to wait and see what will happen on Final day.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more