For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెరపై సందడి చేయనున్న పవన్: జూలైలోనే అంటూ ప్రకటన.. అక్కడ మిస్సైనా ఇక్కడ కాకూడదు

  |

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినీ రంగానికి దూరమయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయిన అతడు.. సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే 'వకీల్ సాబ్' అనే సినిమాను చేయడం.. అది ప్రేక్షకులు ముందుకు రావడం చకచకా జరిగిపోయాయి. అయితే, ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మాత్రం నిరాశగానే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులను అలరించేందుకు పవన్ కల్యాణ్ బుల్లితెరపైకి రాబోతున్నాడు. ఆ సంగతులు మీకోసం!

  ‘వకీల్ సాబ్'గా మారి వచ్చిన పవన్

  ‘వకీల్ సాబ్'గా మారి వచ్చిన పవన్

  దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన చిత్రమే ‘వకీల్ సాబ్'. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. అంజలి, అనన్య, నివేదా థామస్‌, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలు చేశారు. థమన్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్‌లో సూపర్ డూపర్ అయిన ‘పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది.

  ప్రభుత్వం వల్ల ఎదురైన సమస్యలు

  ప్రభుత్వం వల్ల ఎదురైన సమస్యలు

  చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ‘వకీల్ సాబ్' విడుదలకు ముందు నుంచే ఫ్యాన్స్ యమ హంగామా చేశారు. ఇలాంటి సమయంలో ఈ మూవీ బెనిఫిట్, స్పెషల్ షోలు రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆ వెంటనే టికెట్ రేట్లను సైతం తగ్గించాలని జగన్ సర్కారు కొత్త జీవోను తీసుకొచ్చింది. ఇలా ఈ సినిమా ఆడుతున్న సమయంలో ఎన్నో సమస్యలు వచ్చాయి.

  వాటి వల్ల కోత.. కమర్షియల్‌గా ఫ్లాప్

  వాటి వల్ల కోత.. కమర్షియల్‌గా ఫ్లాప్

  ‘వకీల్ సాబ్' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బిగినింగ్ డే కలెక్షన్లు భారీగా వచ్చాయి. కానీ, ఆ తర్వాత పలు అవాంతరాలు ఎదురవడం.. కరోనా వల్ల సినిమా అర్థాంతరంగా ఆగిపోవడం వంటి కారణాలతో లాంగ్ రన్‌లో వసూళ్లు అంతగా రాలేదు. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరలేదు. ఫలితంగా నిర్మాతలకు నష్టాలు ఎదురయ్యాయి.

  అక్కడ మాత్రం సూపర్ డూపర్ హిట్

  అక్కడ మాత్రం సూపర్ డూపర్ హిట్

  అనివార్య కారణాల వల్ల ‘వకీల్ సాబ్' థియేటర్లలో ఎన్నో రోజులు ఆడలేదు. దీంతో అనుకున్న సమయానికంటే ముందే దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో మాదిరిగానే ఓటీటీలో సైతం దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఎక్కువ క్లిక్కులు సాధించిన చిత్రాల జాబితాలో పవన్ మూవీ చోటు దక్కించుకుంది. అలాగే, సంస్థకూ లాభాలనూ తెచ్చిపెట్టింది.

  బుల్లితెరపై సందడి చేయనున్న పవన్

  బుల్లితెరపై సందడి చేయనున్న పవన్

  పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్' మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా త్వరలోనే ప్రసారం కాబోతుంది. ఈ మేరకు ప్రముఖ ఛానెల్ జీ తెలుగు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఫైసల్ కోసం పని చేసే లాయర్ కాదు.. జనం కోసం పని చేసే వకీల్' అంటూ ఓ ప్రోమోను సోషల్ మీడియాలో వదిలింది. జూలైలోనే ప్రసారం కాబోతున్నట్లు కూడా తెలిపింది. కానీ, డేట్ మాత్రం చెప్పలేదు.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  అక్కడ మిస్సైనా ఇక్కడ కాకూడదంటూ

  అక్కడ మిస్సైనా ఇక్కడ కాకూడదంటూ

  లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్' మూవీ కోసం తెలుగు ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూశారు. కానీ, ప్రతికూల పరిస్థితులు వాళ్ల ఆశలను ఆవిరి చేశాయి. ఫలితంగా ఈ సినిమాను చాలా మంది థియేటర్లలో వీక్షించలేదు. అలాగే, సౌలభ్యం లేని వాళ్లు ఓటీటీలోనూ మిస్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బుల్లితెరపై పక్కాగా చూడాలని ఎదురు చూస్తున్నారు.

  English summary
  Tollywood Top Hero Power Star Pawan Kalyan Recent Film is Vakeel Saab. This Movie World Television Premiere on ZEE Telugu in July.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X